మరో వివాదంలో దేవాదాయ శాఖ

మరో వివాదంలో దేవాదాయ శాఖ
November 07 16:59 2017
విజయవాడ,
 హిందూ దేవాలయాలు  వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నారా.. ?  ఉత్సవమూర్తులు ప్రైవేటు కార్యక్రమాల్లో       పాల్గొనవచ్చా ..?  కాసుల కోసం పూజ‌రులు క‌క్కుర్తిప‌డ్డారా? అయ్యవార్లు అడ్డదారుల్లో నడిపిస్తున్నారా? లేక ఎవరైనా నడిపించారా? ఎందుకీ ఈ వివాదం  దేవుడ్ని అందరికి దగ్గర  చేయాలనే సదదుద్దేశంతో.. దేవాలయాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. అందు కోసం  మూలవిరాట్ ను కాకుండా ప్రత్యేకంగా ఉన్న ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించడం  హిందూ సంప్రదాయాల్లో అనవాయితీగా వస్తుంది. ఆ తంతు కూడా అగమశాస్త్రం ప్రకారమే జరగాలి. సాధారణంగా ఉత్సవ విగ్రహాలు ఆలయ అర్చకులు పర్యవేక్షణలో ..  ఊరేగింపు నిర్వహిస్తారు.  అలాగే ఉత్సవవిగ్రహాలు  పెట్టే నైవైధ్యం  కూడా  ఆలయ ప్రాంగణంలో తయారు చేస్తారు. గుడి ప్రాంగణం దాటి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లడం అపచారమంటున్నారు.. భక్తులు . ఇటీవల ప్రముఖ దేవాలయాల్లోని ఉత్సవ విగ్రహాలు    ప్రైవేటు కార్యక్రమాల్లో  దర్శనమివ్వడం వివాదస్పదం అవుతోంది.  అటు బాసరలో .. ఇటు దుర్గ గుడిలో జరిగిన ఘటనలో  అందుకు నిదర్శనం . దీన్ని భక్తులు తీవ్రంగా  వ్యతిరేకిస్తున్నారు. మూలవిరాట్ తో సమానంగా  ఉత్సవవిగ్రహాలను పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేక  సందర్భంలోనే ఉత్సవ మూర్తులు బయటకు తీసుకొస్తారు. గతంలో తిరుమలలో  ఉత్సవ విగ్రహాలను  గిల్డ్  విగ్రహాలుగా తయారు చేసి విదేశాలకు తీసుకెళ్లి  టీటీడీ ఉత్సవాలు నిర్వహించింది.  దీనిపై అప్పట్లోనే వివాదం చెలరేగడంతో…టీటీడీ వెనక్కి తగ్గింది.  దేవుని అలా బయటకు తీసుకెళ్లడం  అపచారం .. అపవిత్రం మంటున్నారు.. భక్తులు చాలా దేవాలయాల్లో  కాసుల కోసం పూజ‌రులు క‌క్కుర్తిపడుతూ..  అయ్యవార్లు అడ్డదారుల్లో  నడుస్తున్నారు. శాస్త్రవిరుద్ధమని తెలిసినా .. ఎందుకింత అరాచకంగా వ్యవహరించినట్టు?  నియమాల‌ను, సిద్ధాంతుల సూచ‌న‌ల‌ను ప‌క్కన‌పెట్టి    ప్రతిరూపులుగా  భావించే ఉత్సవ విగ్రహాన్ని పూజారులు పొలిమేర‌లు దాటించేస్తున్నారు. సెంటిమెంట్‌కే శఠగోపం పెట్టేశారు. ప్రధాన ఆలయం గడప దాటడమే పాపమనుకుంటే ఏకంగా జిల్లాలు దాటించమేంటని  భక్తులు ప్రశ్నిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6525
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author