.రాజకీయ పార్టీ గా జెఏసి…..!

.రాజకీయ పార్టీ గా జెఏసి…..!
November 07 17:35 2017
హైద్రాబాద్,
 ప్రజాఉద్యమాలు చేయాల్సిందే…కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి చేయాలంటే ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే  ఇక ఉద్యమాలతో పటు రాజకీయంగా కూడా పోరాడాలి..అప్పుడే రాష్ట్ర అభివృద్ధి..  అమరుల త్యాగాలకు ఒక అర్ధముంటుంది… లేదంటే తెలంగాణ ప్రజలను సైతం మోసం చేసిన్నట్లు అవుతుంది..ఇదే జెఏసి లో ప్రస్తుతం వినిపిస్తున్న వాయిస్..మరి జాక్ రాజకీయ పార్టీ గా రాబోతోందా..వస్తే ఎలాంటి రూపంతో తెరపైకి రానుంది..లెట్స్ వాచ్ దిస్ స్టోరీతెలంగాణ రాష్ట్ర సాధనలో జెఏసి చేసిన ఉద్యమాలు మరువలేనివి…ఆ ఉద్యమాలతోనే రాష్ట్రం వచ్చిందని చెప్పడంలో కూడా సందేహం లేదు…ఐతే రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు  ప్రభుత్వం పని చేస్తుంది… రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావించిన జాక్ కొంత కలం మౌనంగా ఉంది.ఐతే సర్కార్ అడుగులు ఆ దిశగా లేవని భావించిన జెఏసి మరోసారి రాష్ట్ర అభివృద్ధి కోసం రంగంలోకి దిగింది.తెలంగాణ ట్యాగ్ లైన్ సాధన , రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి , ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రభుత్వాని నిలదీస్తూ వస్తుంది.ఐతే సర్కార్ మెడలు వంచాలంటే ఉద్యంలోను చేయాల్సిందే..కానీ అదే విధంగా రాజకీయంగా కూడా రంగంలో దిగాల్సిన అవసరముందని జెఏసి లో కొందరి వాదన…జెఏసి రాజకీయ పార్టీ గా అవతరించబోతుందని గత కొద్దీ నెలలుగా వార్తలు కోడై కూస్తున్న విషయం తెల్సిందే..ఐతే దీని పై జాక్ ఇప్పటికి ఒక క్లారిటీ ఇవ్వలేదు..కానీ జాక్ రాజకీయ పార్టీ కి  కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేస్తుందని…త్వరలోనే రాజకీయ పార్టీ గా అవతరించబోతుందని దీనికి కావాల్సిన ఆరెంజిమెంట్స్ అన్ని కూడా పూర్తి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ డిసెంబర్ లేదా 2018  జనవరి లో జెఏసి రాజకీయ పార్టీ గా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పార్టీ కోసం పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం..ఇందులో తెలంగాణ పరిరక్షణ సమితి , తెలంగాణ ప్రజా సమితి , తెలంగాణ జన సమితి , తెలంగాణ ప్రజా రక్షణ సమితి పేర్లను పరిశీలిస్తున్నట్లు మనకున్న సమాచారం..ఐతే పేరు ఖరారు చేసి రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యతను జెఏసి అడ్వకేట్ కి అప్పగించినట్లు తెలుస్తుంది.ఐతే ఇప్పటికే జెఏసి తో పలువురు కీలక నేతలు, అలాగే ఎన్ఆర్ఐ లు  టచ్ లో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం…ఇక జెఏసి పార్టీ పెట్టి ఒంటరిగా వెళ్తుందా..లేక అలియెన్స్  తో వెళ్తుందా అనేది మాత్రం కాస్త ఆకస్తికరంగా మారింది..ఐతే జాక్ వర్గాల ప్రకారం…అలినెన్స్ తో వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం..ప్రధాన ప్రతిపక్ష పార్టీ తో జత కట్టి 20 కి పైగా జెఏసి గెలిచే స్థానాలు తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తుందని,,,ఇక మరికొందరు జెఏసి సింగిల్ గా వెళ్తేనే బాగుంటుందని అభిపార్యపడుతున్నట్లు సమాచారం..ఐతే టీఆర్ఎస్ ని గడ్డ దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి కానుక..ఒంటరిగా వెళ్తే అధికార పార్టీ కి కలిసొచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని మరికొందరి అభిప్రాయపడుతున్నట్ల తెలుస్తోంది.ఇక జెఏసి పార్టీ పెట్టిన …జెఏసి ని యధావిధిగా కొనసాగిస్తుందని చెప్పుకొస్తున్నారు.  జాక్ చైర్మన్ కోదండరాం పార్టీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం..డిసెంబర్ లేదా జనవరి లో పార్టీ ప్రజల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది..
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6538
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author