రిమ్స్‌లో కార్డియాలజిస్ట్ కొరత

రిమ్స్‌లో కార్డియాలజిస్ట్ కొరత
November 08 14:22 2017
ఆదిలాబాద్,
ఆదిలాబాద్‌ ప్రాంత వాసుల ఆరోగ్య, వైద్య అవసరాలకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రజారోగ్యం నిమిత్తం సర్కారీ ఆసుపత్రులను పటిష్ట పరిచే కార్యక్రమంలో భాగంగా రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అయితే నాణేనికి మరో పార్శ్వంలా ఆసుపత్రిలో సమస్యలకు తెరపడడంలేదు. ప్రధానంగా ఆసుపత్రిలో గుండె సమస్యలకు వైద్యం అందించే నిపుణులు లేకపోవడం స్థానికులను ఆవేదనకు గురిచేస్తోంది. ఎందుకంటే గుండె పోటు వచ్చినా సరైన చికిత్స అందని పరిస్థితి నెలకొంది. సాధారణ చికిత్స అందిస్తుండడంతో బాధితుల ప్రాణాలకు భరోసా లేకుండా ఉంది. దీంతో అంతా ప్రైవేట్ లేదా హైద్రాబాద్‌లోని పెద్దాసుపత్రులకు వెళ్లాల్సివస్తోంది. ఈ విభాగంలో నిపుణుడి కొరత గ్రహించిన వైద్యాధికారులు గతంలో హైదరాబాద్‌ నుంచి ఓ వైద్యుడిని నియమించారు. అయితే ఆయన కొన్ని నెలలు మాత్రమే సేవలు అందించి వెళ్లిపోయారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
రిమ్స్‌లో రోగులకు గుండెకు సంబంధిత వ్యాధి పరీక్షల నిర్వాహణ అస్తవ్యస్తంగా మారడం మరో సమస్య. గుండెనొప్పితో వచ్చిన రోగులకు కేవలం ఈసీజీ మాత్రమే తీస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి హైదరాబాద్‌కు పంపుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో 2డీఈకో యంత్రం ఉన్నా బాధితులకు ఆ పరీక్ష చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  2డీఈకో యంత్రంపై పరీక్షలు చేయడానికి కార్డియాలజిస్టు లేకపోవడమే కారణమని కొందరు అంటున్నారు. అంతేకాక స్థానికంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారెవరూ ఆసుపత్రిలో లేకపోవడం మరో కారణమని చెప్తున్నారు. ఈ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల కనీసం వ్యాధి తీవ్రతను బట్టి మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు వెళ్లడానికి సిఫారసు చేయవచ్చు. ఇప్పటికైనా జిల్లా వైద్య విభాగంతో పాటూ ప్రభుత్వం స్పందించి రిమ్స్‌లో హృద్రోగాలకు చికిత్స అందించే నిపుణుడిని నియమించాలని అంతా కోరుతున్నారు. ప్రజారోగ్యమే లక్ష్యమని చెప్తున్న ప్రభుత్వ ధ్యేయం నీరుగారిపోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6645
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author