ఈ సారి గెలవకపోతే…అంతే

ఈ సారి గెలవకపోతే…అంతే
November 08 16:57 2017
హైద్రాబాద్,,
2019 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తాను గెలవలేకపోతే, తెలంగాణలో తలెత్తుకుని తిరగలేనని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన, లాబీల్లో తనను కలిసిన మీడియాతో ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తానని, ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన కంచర్ల భూపాల్ రెడ్డికి తనను ఓడించేంత సీన్ లేదని అన్నారు.విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాటం కొనసాగిస్తామని, దీనిపై త్వరలోనే ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్, ఇతర కలుషితాల వల్ల అనారోగ్యంతో బాధపడుతోన్న అనాధ బాలబాలికలను హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయించి ఆదుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి సోదరులు కీలకమైన వ్యక్తులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 ఎన్నికల్ల ఎంపీగా భువనగిరి స్థానం నుంచి గెలుపొందారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6701
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author