అందరిలా అనుకున్నా… కానీ….

అందరిలా అనుకున్నా… కానీ….
November 08 17:03 2017
హైద్రాబాద్,
తనూ అందరు అమ్మాయిల్లాగా ఎన్నో కలలు కన్నానని, కానీ వాటిని నెరవేర్చుకోలేకపోయానని సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేశ్‌బాబు సోదరి మంజుల వాపోయింది.  తన పుట్టిన రోజు సందర్భంగా.. ‘మనసుకు నచ్చింది’ అన్న టైటిల్‌తో తన జీవితంపై ఓ షార్ట్‌ఫిల్మ్ తీసి మహేష్ బాబు ట్విట్టర్ టైమ్ లైన్‌లో పోస్టు చేసింది.దీనిపై ప్రిన్స్ స్పందిస్తూ, “నా ప్రియమైన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చక్కటి ప్రయత్నం” అని అభినందించారు. “హాయ్ నేను మంజుల…” అంటూ ప్రారంభించిన మంజుల ఇందులో ఎన్నో విషయాలను ప్రస్తావించారు. నటిగా రాణించాలని భావించాను, కానీ కాలేకపోయానని, ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యానని తెలిపారు.ఆ బాధను మరచిపోయేందుకు నిర్మాణరంగంపై దృష్టిని సారించానని, అది కూడా సంతృప్తిని ఇవ్వలేదని పేర్కొంది. ఓడిపోతూ, అవకాశాలు రాని వేళ, తనకు తానే ఓ బాధితురాలిగా అనుకుంటూ ఎంతో వేదనపడ్డానని మంజుల తన లఘు చిత్రం ద్వారా వెల్లడించారు. అంతేకాదు తన కుటుంబ నేపథ్యం, తండ్రికున్న అభిమానులు తనకు అడ్డంకిగా మారాయని ఆమె వాపోయారు. తండ్రి అభిమానులే సమాజమని అనుకునేదాన్నని, అది తప్పని తెలుసుకునే సరికే సమయం మించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా వైఫల్యానికి అసలు కారణం తానేనని, ఆపై మనసు మార్చుకుని కొత్త బాధ్యతలు తీసుకోవడం ప్రారంభించిన తరువాత నూతన శక్తి తనలోకి ప్రవేశించిందని తెలిపారు. ప్రయాణం ముఖ్యమేకానీ, గమ్యం ముఖ్యంకాదని మంజుల అభిప్రాయపడ్డారు. నాలోని ప్రతిభ గురించి స్వయంగా తెలుసుకున్న తర్వాత తన ఆలోచనా విధానం మారిపోయిందన్నారు. మనసు చెప్పినట్టుగా నడవడం ప్రారంభించానని, దీంతో విజయం సాధించానని మంజుల ఆనందం వ్యక్తం చేసింది. నీలకంఠ షో చిత్రంతో హీరోయిన్‌గా మంజుల తెరంగేట్రం చేసినా, కావ్యాస్ డైరీ, ఆరెంజ్ చిత్రాల్లో నటించారు. అలాగే మహేష్ నటించిన పోకిరి, నాని చిత్రాలకు, నాగచైతన్య, సమంతల తొలి చిత్రం ఏమాయ చేశావేకు నిర్మాతగా వ్యవహరించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6704
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author