జగన్ పాదయాత్ర సిగ్గుచేటు : ఎమ్మెల్యే పల్లె

జగన్ పాదయాత్ర సిగ్గుచేటు : ఎమ్మెల్యే పల్లె
November 08 17:23 2017
పుట్టపర్తి,
అనంతపురం జిల్లా  పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలం కొడపగానీపల్లి పంచాయతీలో బుధవారం జరిగిన  ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి. పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి న వడ్డెర్ల పెడరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఈసీ వెంకటేష్, మండల కన్వీనర్ దామోదర్ నాయుడు, జడ్పిటిసి మహాలక్ష్మీ సూరి,, ఎంపీపీ వాణి శ్రీనివాస్, కొత్త చెరువు సాగునీటి సంఘం అధ్యక్షుడు శంకర్ నారాయణ,,టీడీపీ సీనియర్ నాయకులు సాలెక్క గారి శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, మాజీ మండల కన్వీనర్ రమేష్, ఎంపీటీసీ ధనుంజయ తదితరులు హజరయ్యారు. కార్యక్రమాంలో భాగంగా టీడీపీ జెండా ఆవిష్కరించి ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అయన వివరించారు. ఈ సందర్బంగా అయనమాట్లాడుతూ ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో సంక్షేమ ఫలాలు అందని అర్హులను గుర్తించి ప్రతి పేద వాడికి సంక్షేమ ఫలాలు అందజేసేందుకే ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ లో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పేదల అభ్యున్నతే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్రంలో పేదల అభివృద్ధికి వైసీపీ అధినేత జగన్ సైంధావుడిలా అడ్డుతగులుతున్నారని అయన విమర్శించారు. పేదల సమస్యలను జగన్ గాలికి వదిలేసి అసెంబ్లీ ని బహిష్కరించి పాదయాత్ర చేపట్టడం చాలా సిగ్గుచేటు.. ఇలాంటి నాయకుడు చరిత్రలో ఎక్కడ లేడని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6713
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author