ఢిల్లీలో మంచు బీభత్సం…రహదారులపై ప్రమాదాలు

ఢిల్లీలో మంచు బీభత్సం…రహదారులపై ప్రమాదాలు
November 08 19:08 2017
న్యూఢిల్లీ,
దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. దట్టమైన మంచుకి కాలుష్యం కలిసిరావడంతో ప్రజల ఇక్కట్లు అంతాఇంతా కాదు.  బారెడు పోద్దెక్కినా చీకట్లు తొలగడంలేదు. దారి కనపడకుండా వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనాల లైట్లు వేసుకున్నా, దారి కనపడకపోవడంలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఢిల్లీ – ఆగ్రా లను కలుపుతున్న యమున ఎక్స్ప్రెస్ వేపై బుధవారం ఉదయం భారీ ప్రమాదం జరిగింది. పొగమంచు దెబ్బకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో గజన్ల కొద్ది  వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఒక కారు ఢీకొని ఆందులోని వారంతా బయటకు వచ్చేలోపు మరో కారు వెనకనుంచి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు. కార్లు ఒకదానిపైకి మరొకటి ఎక్కిపోయాయి. నెమ్మదిగా వెళ్లండంటూ.. అప్పటికే ప్రమాదానికి గురైనవారు కేకలు వేసినా, వాహనదారులు విండోస్ క్లోజ్ చేసి ఉండడంతో వినిపించుకోలేకపోయారు. చేతులు ఊపినా కనిపించలేదు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6730
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author