కొత్త జిల్లాల్లో  రియల్ బూమ్…

కొత్త జిల్లాల్లో  రియల్ బూమ్…
November 09 17:21 2017
మహబూబ్ నగర్,
కొత్త జిల్లాలు ఏర్పాటైన ప్రాంతాల్లో ప్లాట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో కంటే ధరలు మూడింతలు పెరిగాయి. భూముల రేట్లు అమాంతం పెరగడంతో ఇటు రియల్ వ్యాపారులు సంతోష పడుతుండగా…తమకు అందనంతగా రేట్లు పెరిగాయని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మహబూబ్ నగర్ జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరిగాయి.  మహబూబ్ నగర్ లో కొత్తగా గద్వాల్ జోగులాంబ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలు ఏర్పాటయ్యాయి. మహబూబ్ నగర్ సిటీ మినహా మిగతా ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. నాగర్ కర్నూల్ ఏరియాలో జిల్లాల ఏర్పాటుకు  ముందే రియల్ బూమ్ ఉపందుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఆ భూములకు ఇప్పుడు భాగా డిమాండ్ పెరిగింది.  ప్రభుత్వ భవనాలు ఏర్పాటు కానున్న ప్రాంతాల్లో రేట్లు ఎక్కువగా  పెరిగాయి. అయితే కొల్లాపూర్ లో మాత్రం రియల్ వ్యాపారులు డైలమాలో పడ్డారు. ఎస్పీ కార్యాలయం ఏర్పాటు అవుతుందన్న ప్రచారంతో అక్కడ ఎకరానికి నాలుగు కోట్లు పెట్టి కొన్నారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుతో పాటు ఎస్పీ కార్యాలయాలు నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేయడంతో కొల్లాపూర్ లో భూముల రేట్లు తగ్గాయి.  రిజిస్ట్రేషన్లు కూడా తగ్గాయంటున్నారు వ్యాపారులు.జోగులాంబ  గాద్వాల్ జిల్లా ఏర్పాటుపై చివరి నిమిషంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో …  ఇక్కడ ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వ్యాపారులంతా  ఒకేసారి భూములు కొనడంతో  ఆమాంతంగా రేట్లు పెరిగాయి. గతంలో  ఎకరం భూమి లక్షల ధర పలికేది… ఇప్పుడది   కోట్లకు చేరిందని చెబుతున్నారు వ్యాపారులు. రియల్ బూమ్ తో జిల్లలాలో  భూముల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా  పెరిగాయి. రిజిస్ట్రేషన్ పై  సర్కార్ కు పెద్ద ఎత్తున ఆదాయం వస్తోందంటున్నారు అధికారులు. గతంలో కంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. భవిష్యత్ లో భూముల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.వనపర్తి జిల్లా కేంద్రంలోనూ భూములకు భారీగా పెరిగాయి. ఎకరానికి రెండు కోట్లకు పైగా డిమాండ్ ఉందంటున్నారు వ్యపారులు. ధరలు పెరిగాయని… రియల్ వ్యాపారులు సంతోషపడుతుంటే….భూమి కొనే పరిస్థితి లేకుండాపోయిందని సామన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పాటు హైవేలకు రెండువైపులు వెంచర్లు ఏర్పాటు చేశారు రియల్ వ్యాపారులు. అయితే అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసుకున్న తర్వాతే ప్లాట్లు కొనాలని సూచిస్తున్నారు అధికారులు. లేదంటే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6883
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author