13 నెలలుగా జీతాల్లేవ్…ఇబ్బందుల్లో సాక్షర భారత్‌ సిబ్బంది

13 నెలలుగా జీతాల్లేవ్…ఇబ్బందుల్లో సాక్షర భారత్‌ సిబ్బంది
November 09 17:31 2017
హైద్రాబాద్,
సాక్షర భారత్‌ సిబ్బంది 13 మాసాలుగా వెట్టిచాకిరి చేస్తున్నారు. ప్రభుత్వం పైసా విదిల్చడం లేదు. నెలనెలా నిర్వహించే సమీక్షా సమావేశాలకూ అదనపు భారం. కనీసం పత్రికల బిల్లులు కూడా ఇవ్వని దుస్థితి. ఒక్కో జిల్లాకు 1500మంది గ్రామ కో-ఆర్డీనేటర్లు(వీసీ)లు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున వేతనాలు చెల్లించాలి. ఈ ప్రకారం నెలకు మొత్తంగా రూ.30లక్షలు అవుతుంది. 13 నెలలకు సంబంధిచిన వేతనాలు రూ.3కోట్లా90లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇక మండల కోఆర్డీనేటర్లు 33 మంది పని చేస్తున్నారు. వీరికి నెలకొక్కంటికి రూ.6000 వేతనం అందజేయాల్సి ఉంది. ఈ ప్రకారం నెలకు రూ.లక్షా98వేలు చెల్లించాలి. మొత్తం 11నెలలకు చెల్లించాల్సిన వేతనాల మొత్తం రూ.21లక్షా78వేలు చెల్లించకుండా బాకీ పడింది. తమకు వేతనాలు అందజేయాలని ఆయా మండలాల్లో ఎంపీడీఓలు, ఉన్నతాధికారులకు వినతులు సమర్పించినా ఫలితం లేకుండా పోతోందని వీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పని చేసుకోలేక, అప్పగించిన పనికి గౌరవ వేతనం అందకపోవడంతో సాక్షరభారత్‌ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. పండగలకూ కూడా వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి ఉత్సవాలు జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నిరుద్యోగ మహిళలను అభ్యాసకులుగా మార్చడం కోసం ఏర్పాటు చేసినా సాక్షర భారత్‌ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 13 నెలలుగా వేతనాలు చెల్లించక పోవడం, సెంటర్‌లో వేసుకుంటున్న వివిధ దినపత్రికలకూ బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామ కో-ఆర్డీనేటర్లు చేతి చమురు వదులుతుంది. ఆయా పత్రికల ఏజెంట్ల ఒత్తిడి భరించలేక వీసీలు పత్రికల బిల్లులు తమ చేతి నుంచి చెల్లించి ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు. అధికారులు సమీక్షల పేరుతో సిబ్బందిని వేధించడమే పనిగా పెట్టుకున్నా, వారికి అందించాల్సిన వేతనాలను అందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పథకమే సరిగా పని చేయడం లేదని, ఉన్నతాధికారులు సమాధానాలు చెప్పడం అందుకు బలం చేకూర్చుతోంది.సాక్షర భారత్‌ కేంద్రాలను నిత్యం పర్యవేక్షించాల్సిన స్థానిక సంస్థల ప్రతినిధులు బాధ్యతలను మరిచారు. సెంటర్లను తనిఖీ చేయడం ద్వారా వీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకునే అవకాశం ఉంది. వీసీలకు కనీస వసతులతో పాటు, వారి సమస్యలను పరిష్కరిస్తే వయోజనులకు కూడా అక్షరాభ్యాసం చేయించేందుకు శ్రద్ధ చూపుతారనేది గుర్తుంచుకోవాల్సిన అంశం. కానీ నేటి ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోవడం లేదు. దాంతో పథకం మరుగున పడుతోంది. సిబ్బందికి ఇతర పనులు అప్పగించినా వారికి వేతనాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6889
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author