డబుల్‌ ఇళ్ల నిర్మాణాలపై  స్పీడందుకొంది…

డబుల్‌ ఇళ్ల నిర్మాణాలపై  స్పీడందుకొంది…
November 09 21:03 2017
వరంగల్,
నగరంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలపై  అధికారుల పనుల వేగాన్ని పెంచారు. గృహనిర్మాణ, రెవెన్యూ,  మున్సిపల్‌ మరియు ఆర్‌ అండ్‌ బి శాఖల అధికారుల సమన్వయంతో ఇప్పటికే  జితేంద్రనగర్‌, అంబేద్కర్‌నగర్‌ ,ఎస్‌ఆర్‌నగర్‌లలో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించారు.  దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు, వారికిచ్చిన సమయం, నిర్మాణం పూర్తయ్యే గడువు తేదీ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. జితేంద్రనగర్‌, అంబేద్కర్‌నగర్‌లకు సంబంధించి ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా ఉన్న రోడ్లు, భవనాల శాఖ అధికారులు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్‌ నెలలో ఎంజీఆర్‌ కన్‌స్ట్రన్స్‌కు నిర్మాణానికి అప్పగించామని మొత్తం 592 లబ్ధిదారులకు గానూ ఇప్పటి వరకు 123 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. 2017 మార్చి నాటికి ఇండ్ల నిర్మాణాలు పూర్తికానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణానికి సంబంధించి బ్లాక్‌ వారి పూర్తి వివరాలు, ఇంకా మిగిలిన నిర్మాణం ఎప్పటి వరకు పూర్తవుతుందన్న వివరాల గురించి కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఎస్‌ఆర్‌ నగర్‌కు సంబంధించి కూడా పూర్తి వివరాలు అందించాలని, సంబంధిత కాంట్రాక్టర్లను పిలిచి… స్థలం ఒకేచోట దొరకాలని ఏమీ లేదని, నాలుగు లేక అయిదు చోట్లదొరికితే వాటి వివరాలతో నిర్మించనున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6898
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author