మైనారిటీ రిజర్వేషన్ల పెంపునకు పోరాటం : సీఎం కేసీఆర్

మైనారిటీ రిజర్వేషన్ల పెంపునకు పోరాటం : సీఎం కేసీఆర్
November 09 21:47 2017
హైదరాబాద్,
తెలంగాణ శాసనమండలిలో గురువారం నాడు మైనారిటీ సంక్షేమంపై లఘు చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ  రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని సుప్రీంకోర్టు నిబంధన ఉందని, ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారానే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని  అన్నారు.  తమిళనాడులో 9వ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక చట్టం చేసి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచారన్నారు. ముస్లింలతో పాటు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని ప్రధానిని కోరామని, ఇందుకు ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా ప్రధానిని కలిసి.. కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. చ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో మైనార్టీ రిజర్వేషన్ల కోసం మా ఎంపీలు పోరాటం చేస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణను తెచ్చిన విధంగానే రిజర్వేషన్లను సాధిస్తమని సీఎం పునరుద్ఘాటించారు. రిజర్వేషన్లను రాజకీయం చేయడం లేదని, టాస్క్గా తీసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ముస్లింలలో ధనికులు, పేదలూ ఉన్నారన్నారు. ముస్లింలలో వెనుకబడిన వారికే రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో మైనార్టీలకు రూ.932 కోట్లు ఖర్చుచేసింది. కానీ ఈ మూడేళ్ల పాలనలో మా ప్రభుత్వం రూ.2,146 కోట్లు ఖర్చు చేసిందని సీఎం స్పష్టం చేశారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి మూడు సంవత్సరాలైనప్పటికీ మైనారిటీలకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతుందోన్నారు. నిరు పేద కుటుంబాలకు షాదీ ముబారక్ ద్వారా పేద యువతి వివాహానికి రూ. 51000 ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఈ మొత్తాన్ని 75 వేల 116లకు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6907
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author