స్టార్ రేటింగ్ పనులు ప్రారంభించాలి : మంత్రి లోకేష్ 

స్టార్ రేటింగ్ పనులు ప్రారంభించాలి : మంత్రి లోకేష్ 
November 09 21:53 2017
అమరావతి,
రాష్ట్రంలోని పంచాయతీలకు 7 స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. గురువారం నాడు సచివాలయంలో అయన పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛ్ ఆంధ్రా కార్పొరేషన్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భేటీలో శాఖాపరంగా చేపడుతున్న పనులు,నాణ్యతా ప్రమాణాలు,లక్ష్యాలు, సాధించిన ప్రగతి తదితర అంశాలపై పై చర్చించారు. ఈ సందర్బంగా అయనమాట్లాడుతూ  బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత గ్రామాలు,వెర్మి కంపోస్ట్ తయారు చేస్తున్న గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తూ రేటింగ్ ఇవ్వాలని అన్నారు. సిసి రోడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చెయ్యాలి, సిసి రోడ్ల నిర్మాణంతో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని అన్నారు. గ్రామాల్లో డ్రైనేజ్ లను క్రమం తప్పకుండా శుభ్రం చెయ్యాలి. మలేరియా,డెంగ్యూ లాంటి  వ్యాదులు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నూటికి నూరు శాతం గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలి. 7 స్టార్ రేటింగ్ లో కుటుంబానికి నెలకి పది వేల ఆదాయం కల్పించడం ముఖ్యమైన లక్ష్యం.ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలి. గ్రామాల్లో ఆన్ లైన్ ట్యాక్స్ పేమెంట్ కార్యక్రమంలో భాగంగా సర్వే వీలైనంత త్వరగా పూర్తి చేసి పన్నులను క్రమబద్దీకరించాలి. పేదలకు పన్ను లేకుండా చెయ్యాలని అన్నారు. తాగునీటి కార్పొరేషన్ ఏర్పాటు పూర్తి అయ్యింది. ఇక నిధులు సమీకరించి ఇంటింటికి కులాయి ద్వారా తాగునీరు ఇచ్చే కార్యక్రమం పనులు ప్రారంభించాలన్నారు. నీటి లభ్యత అందుబాటులో ఉన్న జిల్లాలో వెంటనే పనులు ప్రారంభించాలి. మొదటి దశ గా నీటి లభ్యత ఉన్న పశ్చిమగోదావరి,కృష్ణా జిల్లాలో త్వరితగతిన పనులు ప్రారంభించాలి.మిగిలిన జిల్లాలో కూడా వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని మంత్రి అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6910
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author