కడపలో నీరుకారుతున్న ఎగ్స్

 కడపలో నీరుకారుతున్న ఎగ్స్
November 10 12:57 2017
కడప,
ప్రభుత్వ పాఠశాలలో చదివే గ్రామీణ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ లక్షాన్ని కొందరు నీరు గారుస్తున్నారు.మద్యాహ్న భోజనం లో వారానికి మూడు రోజులు గుడ్డు అందించాలన్న నిభంధన ఆ నియోజకవర్గం లో అమలుకావడం లేదు.100రోజులుగా గుడ్డు సరఫరా చేయకపోయినా అధికారుల నిర్లక్యానికి అద్దం పడుతున్న ఈ స్టోరి చూడాలంటే కడప జిల్లా కమలాపురం వెళ్లాల్సిందే..
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి.ఈ ఐదు మండలాలో 315 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.వీటిలో 17,258 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అందించే మద్యాహ్న భోజనం లో వారానికి మూడు రోజులు తప్పకుండా అమలు కావాలి కాని ఆ నియోజకవర్గం లో మాత్రము నిబంధనలు అటకెక్కుతున్నాయి.తమకు సంబందించిన వారికి కాంట్రాక్టు అందలేని కారణమే ఈ దుస్థితి కి కారణమని తెలుస్తోంది.నియోజకవర్గం లోని పాఠశాలలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ ను ఒక వ్యక్తి దక్కించుకున్నారు.అంతేకాదు గుడ్లు సరఫరా చేసేందుకు నిబంధనలు పాటించాలని నిర్ణయించుకున్నాడు.ఇక్కడే ఆ నేత కు కాలింది.తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గం లో విద్యార్థినీలకు గుడ్లు పంచుతావా అని కన్నెర్రచేశాడు.దాంతో గుడ్లు సరఫరా ఆగిపోయింది.స్వందించాల్సిన అధికారులు కళ్లు ,చెవులు, నోటితో పాటు నిభందనలను తోక్కెశారు.ఫలితం గుడ్ల సరఫరా అగిపోయిందిఈ ఏడాది ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల నుంచి కమలాపురం నియోజకవర్గం లోని ఐదు మండలాలతో పాటు రైల్వే కోడూరు,కడప లలో కూడ గుడ్లు సరఫరా చేయలేదు.దీంతో పిల్లలకు పౌష్టికాహారం అందని గుడ్డు లాగా తయారైంది.ఆ నేత వ్యవహర శైలిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.పిల్లల పై కక్ష సాధింపు మంచిది కాదని హితువు పలుకుతున్నారు.ఇప్పటికై గుడ్లు సరఫరా చేయించాలని డిమాండ్ చేస్తున్నారుచిన్న కారణానికి పసి మొగ్గల ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్న గుడ్ల సరఫరా అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.మరో వైపు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ఉద్యోగ ధర్మం పాటించని అధికారులపై చర్యలు తో చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6979
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author