విద్యార్ధుల ఆత్మహత్యల సంబంధిత కాలేజి పై క్రిమినల్ కేసులు

విద్యార్ధుల ఆత్మహత్యల సంబంధిత కాలేజి పై క్రిమినల్ కేసులు
November 10 18:31 2017
విద్యార్ధుల ఆత్మహత్యలపై సంబంధిత కాలేజి యజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి, కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్య లపై శాసనమండలిలో సభ్యులు షబ్బీర్ అలీ, భూపతి రెడ్డి,పొంగులేటి సుధాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇచ్చారు. విద్యార్థుల పై ఒత్తిడి తగ్గించేందుకు కాలేజీలకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాలేజీల్లో వసతులు, బోధన పద్ధతులు పర్యవేక్షించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి10 గంటల వరకు ఊపిరి సలపని రీతిలో స్టడీ అవర్స్, సెలవుల్లో కూడా తరగతుల నిర్వహణ, హాస్టళ్లలో సరైన వసతులు లేకపోవడం, విద్యార్థుల పై తీవ్రమైన ఒత్తిడి అనే అంశాలు ఆత్మహత్యలకు దారి తీస్తున్నట్లు ఇటీవల ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో చేసిన తనిఖీల్లో వెల్లడైనట్లు మంత్రి వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు కాలేజీల్లో కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని, ఇంటర్ బోర్డు క్యాలెండర్, నిబంధనలు పాటించని కాలేజీల గుర్తింపు రద్దుకు ఆదేశాలు జరిచేసినట్లు తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు కాలేజి యాజమాన్యాలు, తల్లిదండ్రులతో ప్రభుత్వం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించామన్నారు.  ప్రైవేట్ కళాశాలల ప్రవర్తన వల్ల పిల్లలు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే  ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ కళాశాలలు అన్ని గత ప్రభుత్వాలే మంజూరు చేశాయన్నారు. కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కళాశాలలు నడపడం కోసం అనుమతులు తీసుకొని హాస్టళ్లు కూడా నడుపుతున్నాయన్నారు.దీనిని ప్రభుత్వం గుర్తించి హాస్టళ్లకు కూడా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు. 194 కళాశాలలపై ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడున్న లోపాలను గుర్తించామన్నారు. వాటి పై  చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని వచ్చే మార్చి లోపు చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం మార్చిలోపే గుర్తింపు, అనుమతులు పొందిన  జూనియర్ కళాశాలల జాబితా బయటపెడుతామని ప్రకటించారు. జూనియర్, డిగ్రీ కళాశాలలు అవసరానికి మించి ఉన్నాయని..వాటిని రెగ్యులేట్ చేస్తామని చెప్పారు. కార్పొరేట్ కళాశాలల పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని హామీ ఇచ్చారు.  మరో మూడు నెలల సమయంలో చర్యలు తీసుకోకపోతే అప్పుడు మమ్ములను అడగవచ్చన్నారు. కళాశాలలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, క్రిమినల్ చర్యలకు కూడా ప్రభుత్వం వెనకడుగు వెయ్యదని సభలో స్పష్టం చేశారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7031
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author