వచ్చే ఏడాదిలోగా నగరంలో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం పూర్తి….పురపాలక మంత్రి కెటి రామారావు

వచ్చే ఏడాదిలోగా నగరంలో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం పూర్తి….పురపాలక మంత్రి కెటి రామారావు
November 10 19:38 2017
హైదరాబాద్
వచ్చే ఏడాదిలోగా నగరంలో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి కెటి రామారావు తెలిపారు. నగర పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ప్రక్రియ పూర్తి అయినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు వచ్చే 12 నెలల్లో  వీటి నిర్మాణం పూర్తిచేసేలా పక్కా ప్రణాళికలతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. జలమండలి కార్యాలయంలో జిహెచ్ఎంసి అధికారులతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కేటిఅర్ మాట్లాడుతూ  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమని, దీని పూర్తి చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో  ఏవైనా ఇబ్బందులున్నాయని మంత్రి వర్కింగ్ ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు. వర్కింగ్ ఏజెన్సీలు తెలిపిన సమస్యలు, పలు అంశాలపైన రెవెన్యూ  మరియు జిహెచ్ఎంసి అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. నవంబర్ మాసం నాటికి చోట్ల పనులు ప్రారంభమయ్యేలా నగర పరిధిలోని ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా నగర పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలతో, అధికారులతో సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడారు.సకాలంలో పనులు పూర్తి చేసిన వర్కింగ్ ఏజెన్సీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు నిర్ణయించాల్సింది ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని వర్కింగ్ ఏజెన్సీలకు జరిమానాలు సైతం విధిస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో పాటించాల్సిన ఆధునిక సాంకేతికతలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. వర్కింగ్ ఏజెన్సీలు ఇసుక సరఫరా అంశాన్ని ప్రస్తావన చేసినప్పుడు ఆధ్వర్యంలో నగరానికి నలువైపుల ఒక్కో ఇసుక డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు.   ఇది సగటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న సైట్ల నుంచి సీసీ కెమెరాల  ఫీడ్ తీసుకుని ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలన్నారు. ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా అధికారులు, వర్కింగ్ ఏజెన్సీల కోసం ప్రత్యేకంగా ఒక వాట్స్ అప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7069
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author