చంద్రబాబువి అన్ని వైఫల్యాలే : వైసీపీ ఎమ్మెల్యే రోజా

చంద్రబాబువి అన్ని వైఫల్యాలే : వైసీపీ ఎమ్మెల్యే రోజా
November 10 20:54 2017
హైదరాబాద్,
ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. శుక్రవారం నాడు ఆమె హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  రుణమాఫీ జరగలేదని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని.. ఇలా అన్ని వైఫల్యాలేనని అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, విదేశాల్లో ఎలా దాచుకోవాలని ఆయన ఆలోచిస్తుంటారని ధ్వజమెత్తారు.  నిండు సభలో జనం కష్టాలు పై జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మూడు ఏళ్లుగా అసెంబ్లీ లో జగన్ ప్రజా సమస్యలు పై పోరాడుతున్నారని రోజా అన్నారు.  ఓటుకు నోటు కేసు లో అడ్డంగా దొరికిపోయి హైద్రాబాద్ నుంచి పారిపోయారు.ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసేలా కుట్రలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.  పార్టీ మారిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుంటే సభ కు హాజరు అవుతామని రోజా స్పష్టం చేసారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7109
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author