అనుష్క కోసం… ప్రభాస్ గిఫ్ట్

అనుష్క కోసం… ప్రభాస్ గిఫ్ట్
November 11 00:40 2017
హైద్రాబాద్,
బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో హిట్ ఫెయిర్‌గా నిలిచిన ప్రభాస్, అనుష్కలు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ రూమర్స్‌ను ఇద్దరూ కూడా ఖండించారు. ఈ ప్రచారం పట్ల అనుష్క కాస్త అసహనాన్ని ప్రదర్శిస్తే, వరుసగా సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పుడు ఇలాంటి ప్రచారాలు జరగడం సహజమేనంటూ ప్రభాస్ తేలికగా తీసిపారేశాడు. అయితే గత నెలలో పుట్టినరోజు జరుపుకున్న ప్రభాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ అనుష్క చేసిన ట్వీట్ ఆయన పట్ల గల అభిమానాన్ని చాటి చెప్పింది.”నేను ఎంతగానో ప్రేమించే అద్భుతమైన వ్యక్తి ప్రభాస్ .. సుఖశాంతులతో .. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేసింది. అంతే కాదు మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఖరీదైన చేతిగడియారాలను ఇష్టపడే యంగ్ రెబల్‌స్టార్‌కు ఒక డిజైనర్ వాచ్‌ను కానుకగా అందజేసింది. అనుష్క తన పుట్టినరోజు కూడా ఈ నెల 7న జరుపుకుంది. అయితే ఆమె‌కు బర్త్ డే గిఫ్ట్‌గా ప్రభాస్ ఓ ‘బీఎం డబ్ల్యూ’ కారును ఇచ్చాడనే టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుష్క పుట్టినరోజు నాడు భాగమతి సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పెట్టి ప్రభాస్ శుభాకాంక్షలు తెలియజేశాడు. మరి వీటిలో నిజమెంతో మరి తెలియాలంటే ఈ వార్తపై ఇరువురిలో ఎవరో ఒకరు స్పందించే వరకూ ఓపిక పట్టాల్సిందే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7141
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author