పట్టిసీమ ఫలితాలు అందుతున్నాయ్

పట్టిసీమ ఫలితాలు అందుతున్నాయ్
November 11 00:48 2017
అమరావతి,
 పట్టిసీమ ఫలాలు రైతులకు అందుతున్నాయని.. నదుల అనుసంధానం వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానం, పట్టిసీమపై సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పట్టిసీమ పేరు ఎత్తితో ఎగతాలి చేశారని.. అయినప్పటికీ దృఢసంకల్పంతో ముందుకు వెళ్లి.. లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు చంద్రబాబు.  నదుల అనుసంధానం.. పట్టిసీమపై ఏపీ శాసనసభలో చర్చ జరిగింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పట్టిసీమ, నదుల అనుసంధానం వల్ల జరిగిన ప్రయోజనాలపై చర్చను లేవనెత్తారు. పట్టిసీమ నిర్మాణం ద్వారా రైతుల్లో నమ్మకాన్ని కల్పించిందన్నారు. పట్టిసీమ పుణ్యమా అని లక్షల ఎకరాల్లో పంటలకు సాగునీరు అందించామన్నారు.  ఇదే అంశంపై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సభలో ప్రసగించారు. తమ ప్రశ్నలకు జవాబులు చెప్పలేకే వైసిపి సభకు రావడం లేదన్నారు. నదుల అనుసంధానం, పట్టిసీమ.., వ్యవసాయానికి ప్రాణం పోశాయని అన్నారు. రాష్ట్రం మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి ఉందన్న ఉమా.. నదుల అనుసంధానం దేశ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. నదుల అనుసంధానం, పట్టిసీమపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చర్చలో భాగంగా ఆయన పలు  విషయాలను సభకు వివరించారు. పట్టిసీమ వల్ల రాష్ట్రంలోని అనంతపురం జిల్లా మొదటిస్థానంలోకి రాబోతుందని చెప్పారు. నదుల అనుసంధానం వల్ల నీటి సమస్య ఉండదన్న ఆయన.. ప్రతియేటా.. గోదావరి పరివాహక నీరు సుమారు 2,650 టీఎసీలు సముద్రంలోకి వృధాగా  పోతుందన్నారు. పట్టిసీమను అత్యంత వేగంగా నిర్మించడం వల్ల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాయని పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీని సభలో ప్రదర్శించారు.  పట్టిసీమ విషయంలో ధృడసంకల్పంతో ముందుకెళ్లామని చంద్రబాబు అన్నారు. ఎనిమిదేళ్ల సమస్యను ఒక్కరోజులో పరిష్కరించామని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ పూర్తిచేస్తామంటే రాజకీయ సన్యాసం చేస్తామన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. పట్టిసీమపై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారన్న చంద్రబాబు.. పట్టిసీమ పేరు చెబితే ఎగతాలి చేసిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. అయినప్పటికీ అన్నింటిని భరించి పట్టిసీమను అనుకున్న సమయంలోగా పూర్తి చేశామన్నారు.   నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్న విషయాన్ని సీఎం చంద్రబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు. నీటిని కాపాడుకుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని స్పష్టం చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7144
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author