అయినా.. తీరు మారలేదు

అయినా.. తీరు మారలేదు
November 11 00:58 2017
ఆదిలాబాద్,
ఆదిలాబాద్‌ ఉప రిజిస్ట్రార్‌ కార్యాలయం..అవినీతికి, అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు గతంలో దాడులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. నిఘాలో అధికారులు అడ్డంగా దొరికి అభాసుపాలయ్యారు. ఇంత జరిగినా కార్యాలయ సిబ్బంది తీరు మారకపోవడంపై ప్రజలు విస్తుపోతున్నారు. అక్రమ వసూళ్ల దందాకు బ్రేక్ పడకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి దిగువనే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు ఉంది. భూముల క్రయవిక్రయాల వల్ల ఆదాయం భారీగానే అందుతోంది. అయినప్పటికీ.. ఇక్కడ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. సబ్ రిజిస్ట్రార్కా ర్యాలయంలో ఇద్దరు దిగువస్థాయి ఉద్యోగులు అవినీతిలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. వీరి వల్ల ఇతర అధికారులకూ ధన లబ్ధి చేకూరుతోంది. దీంతో వారూ మిన్నకుండిపోతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరహా లోపాయికారీ ఒప్పందాలతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో వసూళ్ల దందా జోరుగా సాగిపోతోందని చెప్తున్నారు.
అవినీతి, అక్రమ వసూళ్లు, ఏసీబీ దాడులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. దీంతో ఈ దందాకు అడ్డుకట్టవేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆఫీసులో సీసీ కెమేరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిధులు సైతం మంజూరు చేసింది. అయితే తమ బాగోతం బయటపడకుండా సిబ్బందిలో కొందరు అలంకారప్రాయంగా సీసీ కెమేరాలను ఏర్పాటుచేసుకున్నారు. వీటికి కెనెక్షన్లు ఇవ్వలేదు. అంతేకాక ఆఫీసులో కార్యకలాపాలను నిక్షిప్తం చేసే అనుబంధ యంత్రాలను మూలన పడేశారు. మొత్తంగా కెమేరాలను సైలెంట్ గా మార్చేసి యథేచ్ఛగా దండుకుంటున్నారు అక్రమార్కులు. ఇప్పటికే రెండుసార్లు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కానీ.. అప్పట్లో కూడా దిగువస్థాయి సిబ్బందే దొరికిపోయారు. అయినా.. ఈ కార్యాలయంలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. దిగువస్థాయి సిబ్బంది ద్వారానే అక్రమ వసూళ్లు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాగుతున్న అవినీతి దందాకు అడ్డకట్టవేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుండా ఈ అక్రమ వసూళ్ల కార్యక్రమం వికృతరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7147
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author