సుజలం..సుఫలం.. 

 సుజలం..సుఫలం.. 
November 11 01:05 2017
ఆదిలాబాద్‌,
తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. అంతేకాక నీటి వనరులను ఒడిసిపట్టేందుకు బృహత్తర కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే సర్కార్ ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లో భాగంగా చెరువుల పునరుద్ధరణను సాగిస్తోంది. ఇదిలా ఉంటే మిషన్ కాకతీయ పనులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు విడతలుగా సాగాయి. మరికొన్ని పనులు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ సాగించిన పనులతో సత్ఫలితాలే వచ్చాయి. ఇక నాలుగో విడత పనుల నిమిత్తం ప్రభుత్వ ఆదేశాలను బట్టి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తాజాగా గుర్తించిన 272 చెరువులు, వాటి పునరుద్ధరణకు అయ్యే అంచనా వ్యయాలను రూపొందిస్తున్నారు అధికారులు. ఇవే కాక జిల్లాలో 47 కొత్త చెరువుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. జిల్లాలో నాలుగో విడతలో కొత్తగా నిర్మించే చెరువులకు రూ.450.76 కోట్ల వ్యయం అవుతుంది. వీటి వల్ల 9వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశముంది.
ఆదిలాబాద్‌లో పిప్పల్‌ధరి, భవానీగూడ, కర్కి, పాతగూడ గ్రామాల్లో కొత్త చెరువులు నిర్మించనున్నారు. అత్యధికంగా బోథ్‌ నియోజకవర్గంలో చెరువుల నిర్మాణం జరిగే వీలుంది. బోథ్‌లో నిగిని, వాల్‌గుట్టపల్లి, గన్‌పూర్‌, నారాయణ్‌పూర్‌, ఇచ్చోడ మండలంలో ధంపూర్‌, కోకస్‌మన్నూర్‌, రాంపూర్‌, జున్ని, ముక్రా(బి), పొన్న, గుడిహత్నూర్‌ మండలంలో లెండిగూడ, కమలపూర్‌ గ్రామాల్లోనూ చెరవులు నిర్మించనున్నారు. నేరడిగొండ మండలంలో వడూర్‌, నేేరడిగొండ, తలమడుగులో ఉమ్రి, కుచులాపూర్‌, ఉట్నూర్‌లో దంతెనపల్లి, ఇంద్రవెల్లిలో బాడగూడ, లింబగూడ, గౌరపూర్‌, దేవాపూర్‌, హర్కపూర్‌ గ్రామాల్లో నార్నూర్‌ మండలంలో మంజ్రె, హీరాపూర్‌, మారేగావ్‌, చోర్‌గావ్‌, రాజులగూడ, మహేగావ్‌లో బజార్‌హత్నూర్‌లో గంగాపూర్‌ గ్రామాల్లో చెరువుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని ఇటీవలే ఉట్నూర్‌లో జరిగిన సభలో సంబంధిత నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. జలవనరుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం జిల్లాలో చెరువులను పునరుద్ధరించడమేకాక కొత్త చెరువులను తవ్వించేందుకు చర్యలు తీసుకోవడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల వల్ల జిల్లాలో నీటి ఎద్దడి తగ్గే అవకాశం ఉంటుందని, జలమట్టాల శాతం కూడా పెరుగుతుందని చెప్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7149
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author