ముకుందన్ స్పెషల్ గెస్ట్ గా స్వీటీ 

 ముకుందన్ స్పెషల్ గెస్ట్ గా స్వీటీ 
November 11 13:18 2017
హైద్రాబాద్,
స్వీటీ అనుష్కపై వచ్చిన గాసిప్పులు మరే హీరోయిన్ పై రాలేదేమో. సూపర్ తో మొదటి ఛాన్స్ ఇచ్చిన నాగార్జునతో అనుష్కకి ఎఫైర్ వుందని మాట్లాడుకున్నారు. నాగచైతన్యతో కూడా ముడిపెట్టారు. కొంతకాలం తర్వాత హీరో గోపిచంద్ తో అన్నారు. ఆ తర్వాత ఒక బిజినెస్ మెన్ తో. ఎప్పటి నుండో ప్రభాస్ పేరు కూడా వినిపిస్తుంది. ”మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతున్నా” సమ్ థింగ్ సమ్ థింగ్ అనే గాసిప్పులు ఆగడం లేదు. తాజాగా మరో హీరోతో ఆమెకు లింక్ పెడుతున్నారు. అనుష్క తాజా చిత్రం బాగ్ మతి. ఇందులో మలయాళం నటుడు ఉన్నిన్ ముకుందన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అనుష్కకి అతడికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అనుష్కకి అతడు అంటే మంచి అభిమానం ఏర్పడింది. ఇరువురు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా అభిమానం చాటుకున్నారు. అయితే ఇప్పుడా అభిమానం మరో లెవల్ కి వెళ్ళిందట. మొన్న అనుష్క పెట్టిన రోజు జరిగింది. అసలు ఇండస్ట్రీలో ఎవరూ కూడా వేడుకలో కనిపించలేదు. స్వీటీ కూడా మీడియాకు దూరంగా వుంది. ఐతే ఉన్ని ముకుందన్ మాత్రం స్పెషల్. అనుష్క తో కేక్ కట్ చేయించాడు. ఈ ఇద్దరూ కలసి బర్త్ డే పార్టీ జరిపుకున్నారు. దీనికి సంబధించిన ఓ పిక్ బయటికివచ్చింది. ఇప్పుడీ పిక్ వైరల్ అవుతుంది.అసలే గాసిప్పులు కోసం వెయిట్ చేసే గాసిప్పు రాయుళ్ళు ఈ పిక్ ను ఆదరంగా చేసుకొని హాట్ హాట్ గాసిప్పులు వండేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7188
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author