ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి
November 11 14:43 2017
గుంటూరు,
గుంటూరు జిల్లా మాచర్ల మండలం  తాళ్ళ పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు తాళ్ళ పల్లి వద్ద సాగర్ కుడి కాలువలో ఈతకువెళ్ళి గల్లంతయ్యారు. శనివారం ఉదయం తాళ్ళ పల్లి గ్రామానికి చెందినఏడుగురు విద్యార్థులు తాళ్లపల్లి బ్రిడ్జి వద్ద వాకింగ్ వెళ్లారు .అందులో  జక్కుల రవీంద్ర(12 ), కొమ్ముగొని దత్తు  (12) కాలువ వద్ద ఈతకు వెళ్లారు. దత్తు తండ్రి సత్యం వెతుకు కుం టూ వచ్చి విద్యార్థులను అడగగా కాలువ వద్దకు వెళ్లినట్లు చెప్పారు. సత్యం కాలువ వద్దకు వెళ్లి చూడగా  విద్యార్ధుల దుస్తులు మాత్రమే కనిపించాయి. దీంతో ఈతకు దిగి గల్లంతు అయ్యారని తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  విజయపురి సౌత్  సోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలించగా దత్తు మృతదేహం దొరికింది. .రవీంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో  రెండు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7229
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author