కోదండరామ్ రాజకీయ పార్టీకి అంతా సిద్ధం

కోదండరామ్ రాజకీయ పార్టీకి అంతా సిద్ధం
November 11 23:02 2017
హైద్రాబాద్,
ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోందడరామ్ కొత్తగా పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దీనిపై త్వరలోనే ఆయన అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. నాంపల్లి కార్యాలయంలో జరిగిన ఐకాస నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల సాకుతో ప్రభుత్వం సభలు, నిరసనలను అడ్డుకోలేదన్నారు. కొలువులకై కొట్లాట సభపై కోర్టులో తమకు అనుకూల తీర్పు రావడాన్ని ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. పోలీసులు సరూర్‌నగర్‌ మైదానంలో సభ పెట్టుకోవచ్చని తెలిపారన్నారు. నల్గొండలో డిసెంబర్‌ 9, 10 తేదీల్లో అమరుల స్ఫూర్తియాత్ర నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ నెల 30న కొలువులకై కొట్లాట సభ నిర్వహిస్తామన్నారు.ఐకాస తరఫున రాజకీయ పార్టీ అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని కోదండరామ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. రాజకీయ రంగంలోనూ కార్యాచరణ ఉండాలని తమకు సూచనలు వస్తున్నాయని, పార్టీ ఏర్పాటుపై ఐకాసలో ఇంకా చర్చ జరుగుతోందని తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7265
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author