కొత్త రికార్ట్ క్రియేట్ చేసిన టైగర్ జిందా హై

కొత్త రికార్ట్ క్రియేట్ చేసిన టైగర్ జిందా హై
November 11 23:23 2017
హైద్రాబాద్
 రోజుల్లో ప్రతీదీ రికార్డే. వసూళ్ల దగ్గర నుంచి యూట్యూబ్ వ్యూస్, అంతకన్నా లోతుల్లోకి వెళ్లి యూట్యూబ్ లైక్స్ ను కూడా లెక్కేస్తున్నారు సినీ జనాలు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తాజా సినిమా ‘టైగర్ జిందా హై’ కొత్త రికార్డును స్థాపించిందట. ఇది యూట్యూబ్ లైకుల విషయంలో. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సల్మాన్ గత సినిమా ‘ట్యూబ్ లైట్’నిరాశ పరిచినా.. ఆ లోటును భర్తీ చేసేలా ఉంది టైగర్ జిందా హై ట్రైలర్.ఇంకే ముంది.. విడుదల అయిన కొద్ది గంటల్లోనే ఈ సినిమా బోలెడన్ని వ్యూస్ పొందింది. ఇప్పటికే వ్యూస్ విషయంలో ఈ సినిమా మూడు కోట్లకు చేరువ అవుతోంది. అతి తక్కువ వ్యవధిలోనే ఈ స్థాయి వ్యూస్ పొందిన ట్రైలర్ గా టైగర్ జిందా హై రికార్డును స్థాపిస్తోంది. అలాగే ఈ ట్రైలర్ కు భారీ స్థాయిలో లైకులు కూడా దక్కుతున్నాయట.యూట్యూబ్ లో ఈ టైగర్ జిందా హై అఫిషియల్ ట్రైలర్ కు దాదాపు ఏడు లక్షల లైకులు దక్కాయి ఇప్పటి వరకూ. మరే భారతీయ సినిమా ట్రైలర్ కు కూడా ఈ స్థాయిలో లైకులు రాలేదట. బాహుబలి-2 ట్రైలర్ కూడా దాదాపు ఆరున్నర లక్షల లైకులు పొందింది. ఇప్పటికే ఆ నంబర్ ను టైగర్ జిందా హై దాటేసింది. బాహుబలి 2 ట్రైలర్ ను యూట్యూబ్ లో ఇప్పటి వరకూ ఐదు కోట్లా డెబ్బై లక్షల మంది చూశారు. సల్మాన్ సినిమా ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్ కు దగ్గర పడింది. ఈ ఊపు చూస్తుంటే.. త్వరలోనే వ్యూస్ విషయంలో కూడా బాహుబలి 2 రికార్డును సల్మాన్ సినిమా దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7277
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author