అభివృద్ధిలో దూసుకుపోతున్న పాలపర్రు

 అభివృద్ధిలో దూసుకుపోతున్న పాలపర్రు
November 11 23:48 2017
గుంటూరు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు మోడి, చంద్రబాబు నాయుడు సలహా మేరకు దేశ వ్యాప్తంగా పలువురు నేతలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అయితే మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా… కేంద్ర మంత్రి సృజనా చౌదరి దత్తత తీసుకున్న పాలపర్రు గ్రామం మాత్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.గుంటూరుజిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామాన్ని కేంద్రమంత్రి సృజనా చౌదరి దత్తత తీసుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇప్పటి జరుగుతున్న పనులును పరిశీలించడం, పెండింగ్‌లో ఉన్న కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కొన్ని అభివృద్ధి పనులకు ప్రభుత్వ నిధులు సమకూరుస్తుండగా.. మరికొన్న తన సొంత సంస్థ సృజనా ఫౌండేషన్‌ ద్వారా చేపట్టారు. గ్రామానిక విచ్చేసిన మంత్రికి  పెద్ద ఎత్తున గ్రామస్థులు ఎదురేగి…. స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్దనలు చేవారు. ఆ తరువాత గ్రామంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.తాగునీటి సమస్య పరిష్కారానికి కోటి 30 లక్షలు మంజూరు చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే రావెల కిషోర్‌ బాబు చెప్పారు. ఎంతోకాలంగా గ్రామానికి మంచినీటిని అందించే పైప్‌లైన్‌ నిర్మాణం పరిష్కారంలో మంత్రి లోకేష్‌ కృషి ఎనలేదని కొనియాడారు.రాష్ట్ర ప్రజలకోసం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలనుతెలుగుదేశం పార్టీ చేపడుతుందని మంత్ర పత్తిపాటి పుల్లారావు చెప్పారు. గ్రామ ప్రజలకు అందుబాలోని ఓగేరు వాగుకు నీళ్ళిప్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి సృజనా చౌదరి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళతారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను గుర్తించామని, వాటన్నింటినీ క్రమ పద్దతిలో తీరుస్తామని కేంద్ర మంత్రి సృజనాచౌదరి చెప్పారు. తన సొంత వ్యాపార సంస్థ ద్వారా కార్పోరేట్‌ బాధ్యత కింద, సృజనా ఫౌండేషన్‌ ద్వరా, ప్రభుత్వ నిధుల ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రజా ప్రతినిధుల మీద ఎక్కవ వత్తిడి తీసుకొస్తేనే ఏదైనా సాధించగలరని చెప్పారు. ఓటు వేయడంతోనే పని పూర్తి కాదని చెప్పారు.
గ్రామంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్థులు కేంద్రమంత్రి సుజనా చౌదరిని ఘనంగా సన్మానించారుగ్రామం అభివృద్ధికి సుమారు రూ.10 కోట్ల వ్యయం అవుతుందన్న అంచనాతో పనులు చేపట్టారు. ఇప్పటికే  చేపట్టిన అభివృద్ధి పనులు కేంద్ర మంత్రి సృజన చౌదరి చెందిన సృజన ఫౌండేషన్‌ తరఫున కొనసాగుతున్నాయి.  ఆయన రాకపోయినా గ్రామంలో ప్రగతి పరుగులు పెడుతోంది. ఆధునిక పరికిరాల నమూనా ఆధారంగా అత్యాధునిక డిజిటల్ తరగతుల నిర్మాణం జరిగింది. తరగతి గదులు, కంప్యూటర్‌, డిజిటల్ ప్రోజేక్టర్స్,తదితర సౌకర్యాలు కల్పించారు ఈనిర్మాణానికి 10.34 లక్షల  కేటాయించారు. 2.55 లక్షలతో క్రీడాప్రాంగణం, వేస్ట్ మేనేజిమెంట్ కోసం 4.96 లక్షలు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల క్రింద  ౩౦ లక్షలు, గ్రామంలోని రెండు చెరువుల చుట్టూ ఇనుప కంచే నిర్మాణంకోసం పది లక్షలు ఖర్చు చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7289
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author