బోటు బోల్తా పడింది

November 12 23:47 2017

విజయవాడ : కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. బోటు తిరగబడిన సమయంలో సుమారు 45 మంది ఉన్నట్లు తెలుస్తోంది. నదిలో పడిన 15 మందిని రెస్క్యూ టీం రక్షించింది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

చీకటి పడుతుండటంతో శక్తిమంతమైన లైట్లతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. భవాని ఐలాండ్కు వెళ్లిన బోటు తిరిగి పవిత్ర సంగమం ఘాట్‌కు వస్తున్న సమయంలో ఫెర్రీ ఘాట్‌ వద్ద ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బోటు బోల్తా పడిన ప్రదేశంలో 20 అడుగుల వరకూ లోతు ఉండొచ్చని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అందుబాటులో ఉన్న గజ ఈతగాళ్లు అందరూ బోటులోని వారిని రక్షించేందుకు వెళ్లినట్లు తెలిసింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7316
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author