48 గంటల్లో అల్పపీడనం
19 కి వాయుగుండంగా మార్పు
విశాఖపట్నం జిల్లా,న్యూస్:-నగరంవైపు దూసుకొస్తున్న వాయుగుండం మరోమారు ప్రకృతి విలయతాండవం చెయ్యబోతున్నద అంటే అవును అనే చేపక్క తప్పదు,తుఫాన్ ప్రమాదంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు.గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందిని,నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి మధ్య బంగాళాఖాతంలో 48 గంటల్లో అల్పపీడనంగా మారనున్నది.ఈ నెల 19వ తేదీకి ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది వాయువ్య దిశగా పయనించి ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకుతుందని పేర్కొంది. గంటకి 100 నుండి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం 18,19,20 తేదీలు సెలవులు ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం….