చిన్న తిరుమలలో దోచేస్తున్నారు

చిన్న తిరుమలలో దోచేస్తున్నారు
November 13 13:54 2017
 ఏలూరు,
శ్రీవారి క్షేత్రంలో యాత్రికుల బ్యాగులకు భద్రత పేరుతో నిర్వాహకులు నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. దేవస్థానం నిర్ణయించిన ధరలకు రెట్టింపు వసూలు చేస్తు గుత్తేదారు దర్జాగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదని యాత్రికులు ఆరోపిస్తున్నారు.ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. ఆలయ భద్రతలో భాగంగా దేవస్థానం ఏర్పాటు చేసిన క్లోక్‌ రూమ్‌లో యాత్రికులు తమ బ్యాగులను భద్రం చేసుకుంటారు. ఇదిలా ఉండగా ఏడాది పాటు క్లోక్‌ రూమ్‌ నిర్వహణకు బహిరంగం వేలం ద్వారా గుత్తేదారునికి నిర్వహణ హక్కు కల్పించింది. ఒక్క బ్యాగుకు రూ.ఐదు మాత్రమే వసూలు చేయాలని నిబంధన విధించింది. దేవస్థానం నిబంధనలు ప్రకారం జిఎస్‌టితో కలిపి నెలకు రూ.1.71 లక్షలు నిర్వాహకులు దేవస్థానానికి చెల్లించాల్సి ఉంది. బ్యాగుకు రూ.ఐదు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా గుత్తేదారు నిబంధనలకు విరుద్ధంగా రూ.పది వసూలు చేస్తున్నారు. నిర్వాహకులు ఇచ్చే టిక్కెటుపై కూడా ధర ముద్రించి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. దేవస్థానం తనకు వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని యాత్రికులు పడే ఇబ్బందులు మాత్రం గాలికొదిలేశారని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్కటే కాదు, దేవస్థానంలో యాత్రికులు అవసరార్ధం విక్రయించే పలు దుకాణాల నిర్వాహకులు కూడా యాత్రికులు నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. దేవస్థానం విధించిన షరతులకు లోబడి ఏ ఒక్కరూ తమ వ్యాపారాల ను నిర్వహించడం లేదు.క్షేత్రంలో మూడు ప్రాంతాల్లో దేవస్థానం క్లోక్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. పార్కింగ్‌ సమీపంలో, తూర్పురాజగోపురం ప్రాంతంలోని సప్తగోకులం వద్ద, కేశ ఖండన శాల వద్ద ఇవి యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి. శని, ఆదివారాలతో పాటుగా వివాహ వేడుకల సమాయాల్లో ఈ క్లోక్‌ రూమ్‌లు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో సప్త గోకులం వద్ద ఆరుబయట గార్డెన్‌లో బ్యాగులను ఉంచి యాత్రికులు నుండి సొమ్ములు వసూలు చేస్తున్నారు. దీనివల్ల యాత్రికుల బ్యాగులకు భద్రత కరువైంది.చినవెంకన్న క్షేత్రంలో కొందరు వ్యాపారులు దేవస్థానం నిర్వహించే దుకాణాల హక్కు బహిరంగ వేలంలో పాల్గొని హెచ్చుపాటకు హక్కు పొందుతున్నారు. ఆ తర్వాత నెలనెలా అద్దెలు చెల్లించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో యాత్రికులు నుండి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఏ ఒక్క దుకాణం వద్ద ధరల పట్టికలు కానరావడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాటిని యాత్రికులకు కనబడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీటన్నింటిని పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడమేఅధిక వసూళ్లుకు కారణంగా చెప్పవచ్చు.ఒక బ్యాగుకు రూ.పది వసూలు చేస్తున్నారు. స్వామి దర్శనానికి వెళ్లే ముందు నా బ్యాగులు క్లోక్‌ రూమ్‌లో పెట్టాను. నిర్వాహకులు నా ఒక్క బ్యాగుకు రూ.పది వసూలు చేశారు. భద్రత పేరుతో ఇలా వసూలు చేయడం దారుణం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7383
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author