నేలకొరిగిన చేలు.. రైతుల దిగాలు

నేలకొరిగిన చేలు.. రైతుల దిగాలు
November 13 15:00 2017
అనంతపురం,
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లోని వరిచేలు గాలులకు నేలకొరగడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ కోతలు ప్రారంభమయ్యాయి. కూలీలతో కోతలు కోయించి పంటలు ఒబ్బిడి చేసుకోవడానికి ఖర్చులు అధికమవ్వడంతో రైతులు ఆధునిక యంత్రాలతో వరిచేలు కోతలు కోయిస్తున్నారు. గత నాలుగు రోజులుగా వీస్తున్న తూర్పు గాలుల వల్ల వరిచేలు మండలంలో పూర్తిగా నేలకొరిగాయి. దీనివల్ల ధాన్యం ఉత్పత్తి తగ్గడమే కాక యంత్రాల సాయంతో కోతకు పనికిరాకుండా పోతున్నాయని రైతులు మధన పడుతున్నారు. నేలకొరిగిన వరి చేలను యంత్రాలతో కోయించాలంటే వరికోతకు ఎక్కువ సమయం పట్టడమే కాక వ్యయం అధికమౌతుందని రైతులు దిగాలు చెందుతున్నారు. కూలీలతో పనిచేయిస్తే పెట్టుబడి కూడా రాదని, దానికితోడు అప్పుల పాలు కావలసిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మండలంలోని గ్రామాల్లో వరిచేలను పరిశీలించి నేలకొరిగిన వరి చేలకు ప్రధానమంత్రి ఫసలీ బీమా పథకంలో నమోదు చేసి తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7399
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author