జహీరాబాద్ లో  ట్రాఫిక్ సమస్య…!

జహీరాబాద్ లో  ట్రాఫిక్ సమస్య…!
November 13 17:41 2017
మెదక్‌
జహీరాబాద్ పట్టణంలో రోడ్డుపై వాహనాలను యథేచ్ఛగా, అక్రమంగా పార్కింగ్ చేస్తుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్డులో ఈ సమస్య నెలకొనగా, తహసీల్దార్ కార్యాలయం, బ్లాక్ రోడ్డు, హనుమాన్ మందిర్, భవానీ మందిర్ రోడ్డులో సమస్య మరింత తీవ్రంగా ఉంది. జాతీయ రహదారిపై ఉన్న ఎస్‌బీఐ వద్ద రోడ్లు పై ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇబ్బడిముబ్బడిగా చేస్తున్న పార్కింగ్‌ను నియంత్రించకపోవడంతో ఈ సమస్య నానాటికి తీవ్రంగా మారుతున్న ది.ఆర్టీసీ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు ప్రతి రోజు వాహనాలు రోడ్డుపై నిలుపడంతో ట్రాఫిక్ సమస్య నెలకొనగా, భారీ వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతున్నది. ప్రతి రోజు రెవెన్యూ డివిజన్, తహసీల్దార్, కోర్టు కార్యాలయానికి వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డుకిరువైపులా హోటళ్లు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు విస్తరించి ఉండగా, ఆయా కార్యాలయాల పనుల నిమిత్తం వచ్చే వారు తమ వాహనాలను దుకాణాల ఎదుట రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. భవన యాజమాన్యాలు, సంస్థల వారు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయకపోవడంతో సమస్య జఠిలమవుతున్నది. అసలే ఇరుకుగా ఉన్న రోడ్డు వాహనాల యథేచ్ఛగా నిలుపడంతో మరీ ఇరుకుగా మారింది.జాతీయ రహదారిపై పుట్‌పాత్ వ్యాపారులు తోపుడు బండ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. చిరు వ్యాపారులు పుట్‌పాత్‌పైనే కొబ్బరి బొండాలు, డబ్బా దుకాణాలు ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. జాతీయ రహదారిపై చిరు వ్యాపారాలు డబ్బాలు ఏర్పాటు చేసినా పట్టించుకోవడం లేదు. కొందరు జాతీయ రహదారి ప్రక్కన డబ్బాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరో పణలు బలంగా వినిపిస్తున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7428
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author