నవంబర్ 28నే మెట్రో

నవంబర్ 28నే మెట్రో
November 13 17:44 2017
హైద్రాబాద్‌,
నవంబర్ 28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే మెట్రో ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం మోదీని ఆహ్వానించిందని గుర్తు చేశారు. దేశ చరిత్రలో మొదటిసారిగా 30 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రారంభిస్తున్నామని చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నగరంలో మెట్రో రైలు నిర్వహణ కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2,240 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్రం రూ. 1,458 కోట్లు సమకూరుస్తుందన్న మంత్రి.. రూ. 958 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. మొదటి దశ 30 కిలోమీటర్ల మెట్రోను ఈ నెలాఖరులో ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని తెలిపారు. మెట్రోను పూర్తిస్థాయిలో నడిపించేందుకు 57 రైళ్లు అవసరమన్నారు. అన్ని రైళ్లు కూడా వచ్చాయన్నారు. అన్ని రకాలుగా, అన్ని హంగులతో ప్రారంభానికి మెట్రో సిద్ధమైందన్నారు. మెట్రో రైలు పనుల్లో ఆలస్యం జరిగిందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాయగిరి రైల్వేస్టేషన్‌ను యాదాద్రిగా పేరు మార్చి అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7431
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author