క్రమ క్రమంగా పెరుగుతున్న తెలుగు సినిమా రేంజ్ 

క్రమ క్రమంగా పెరుగుతున్న తెలుగు సినిమా రేంజ్ 
November 13 19:26 2017
 హైద్రాబాద్,
తెలుగు సినిమా రేంజ్ క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ రూ.150 కోట్లకు చేరిపోయింది. ఇటీవలే మహేశ్ బాబు ‘స్పైడర్’ సినిమాను దాదాపు రూ.150 కోట్ల మొత్తంతో రూపొందించారనే మాట వినిపించింది. అంతకు ముందు ‘బాహుబలి-2’ అదే స్థాయి బడ్జెట్ తో రూపొంది వసూళ్లలో కొత్త రికార్డులను స్థాపించింది. ఇక మరోవైపు ప్రభాస్ సినిమా ‘సాహో’ బడ్జెట్ కూడా రూ.150 కోట్లు అనే మాట వినిపిస్తోంది. ఇలా టాలీవుడ్ రేంజ్ బడ్జెట్ విషయంలో 150 కోట్లకు చేరినట్టే.మరోవైపు హీరోల రెమ్యూనరేషన్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయనే మాట వినిపిస్తోంది. తెలుగునాట కొంతమంది హీరోలు ఇప్పుడు ఒక్కో సినిమాకు పాతిక కోట్ల రూపాయల వరకూ తీసుకుంటున్నారని టాక్ ఉంది. డైరెక్టుగా డబ్బు రూపంలో కాకుండా.. ఓవర్సీస్ కలెక్షన్స్, ఏపీలో ఏరియాల వారీగా రైట్స్ ను తీసుకుంటున్న హీరోల పారితోషకం పాతిక కోట్ల రూపాయలను రీచ్ అవుతోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.మరి ఇప్పుడు ఒక హీరోకి ఏకంగా నలభై కోట్ల రూపాయల రెమ్యూనరేషన్.. అనే టాక్ వినిపిస్తోంది. అది మరెవరికో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు. పవన్ కు ఈ భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తోందట మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇది వరకూ ‘శ్రీమండుతుడు’ ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాలను రూపొందించిన ఈ నిర్మాణ సంస్థ పవన్ తో ఒక సినిమాను తీయాలని అనుకుంటోందట. దీనికి రికార్డు స్థాయిలో ఏకంగా నలభై కోట్ల రూపాయల పారితోషకాన్ని ఆఫర్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోతాడనే అంచనాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో త్వరగానే సినిమాను పూర్తి చేసేస్తాం అంటూ.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిపాదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ భారీ మొత్తంతో సినిమా చేయడానికి పవన్ ఓకే అంటాడా? ఈ రికార్డు స్థాయి పారితోషకం టాక్ లో నిజమెంతా? అనే విషయాలు ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7483
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author