జగన్ కి ఝలక్ ఇస్తున్న సొంతోళ్లు

జగన్ కి ఝలక్ ఇస్తున్న సొంతోళ్లు
November 14 11:07 2017
కర్నూలు
వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు ఇంటి సెగ తగులుతోంది. తన సొంత జిల్లా ఎమ్మెల్యేలే ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో జగన్ కు పాదయాత్రలోనే చుక్కలు కనపడుతున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పార్టీ అధినేత‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. తమను కలవకుండానే జగన్ పాదయాత్ర చేస్తున్నాడని ఆయన అలకబూనారట. తన నియోజకవర్గంలో నాయకులను కలవకుండా జగన్ ఎందుకు వెళుతున్నారని అర్థం కావడం లేదని చెబుతున్నారాయన. రాచమల్లు ఏం చేసినా..జగన్ మాత్రం పట్టించుకోకుండానే తన పని తాను చేసుకుపోతున్నాడు.    మరోవైపు ఎమ్మెల్యే ప్ర‌సాద్‌రెడ్డి అనుచ‌రులు త‌మ నాయ‌కుడికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినా జగన్ లైట్ తీసుకున్నారు. మరీ తెగేదాక లాగడం ఎందుకనే ఆలోచనతో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు. గతంలోనే ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు ప్ర‌సాద్‌రెడ్డి టీడీపీలో చేర‌తార‌ని జోరుగా ప్రచారం సాగింది. ఆదినారాయణరెడ్డితో వెళ్లేందుకు సిద్దమైనా..తర్వాత వెనక్కు తగ్గాడాయన. తనకు వైఎస్ కుటుంబం అంటే ప్రేమ అని..అందుకే పార్టీని వీడి వెళ్లేది లేదని చెబుతున్నాడట. అయినా సరే జగన్ అతన్ని నమ్మడం లేదంటున్నారు. అందుకే రాచమల్లును పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే 22 మంది వైకాపా ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఇంకొంత మంది పార్టీ మారేందుకు సిద్దమైనా..టీడీపీ అంత ఆసక్తి చూపడం లేదంటున్నారు. ఫలితంగా ఇప్పటికీ అంతే ఉత్కంఠ కొనసాగుతోంది.  మరో వైపు తమ సమస్యలను పరిష్కరించాలని అడిగితే నేతలు ఏం చేస్తారు. పని చేయకపోయినా హామీనిచ్చి పంపుతారు. లేదంటే సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఎవరూ వారిని కొట్టి తిట్టి పంపరు. కానీ జగన్ పాదయాత్రలో ఇందుకు విరుద్దంగా జరిగింది. జగన్ తన గుండాలతో ప్రజలనే కొట్టించారనే ఆరోపణలు వచ్చాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో జరిగిందా సంఘటన. జగన్ ప్రైవేటు భద్రతా సిబ్బంది స్థానికులను కొట్టారు. జగన్ దగ్గరకి రావద్దని హెచ్చరించారు. సి.ఎం రమేష్ సొంత ఊరిలో జరిగిందా సంఘటన. దీంతో ప్రజలంతా జగన్ కు ఎదురు తిరిగి ఆందోళనకు దిగారు. ఫలితంగా జగన్ పాదయాత్రను కాసేపు ఆపేయాల్సి వచ్చింది. వారు పెద్దగా గొడవ పడుతున్నా..జగన్ ఒక్క మాట మాట్లాడలేదు. కొందరికి బిర్యానీ, రూ. 400 ఇస్తామని చెప్పి తీసుకువచ్చారట. కనీసం మంచినీళ్లు ఇవ్వలేదట. అందుకే వారి సంగతి చెప్పుకునేందుకు జగన్ వద్దకు వచ్చారట. ఇటు పొలం పనులు పోయింది. అటు కూలీ రాలేదు. జగన్ కోసం వచ్చినా కనీసం గుక్కెడు మంచనీళ్లు ఇవ్వలేదని వాపోతున్నారు. ఫలితంగా జగన్ మనుషులను కూలీకి తెచ్చి పంపుతున్నారని తెలుస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7507
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author