బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దాం

బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దాం
November 14 16:43 2017
కదిరి,
బాలలు భారతదేశ సంపద అని, బాల కార్మికులు లేని సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ కె.రఫీమున్నీసా పిలుపునిచ్చారు. కదిరిలో ఐసీడీఎస్ తూర్పు ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ సభలో ఆమె మాట్లాడారు. తల్లిదండ్రులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారు బాలల ఉజ్వల భవితకు పాటుపడాలని ఆమె కోరారు. ప్రభుత్వాలు బాలికల విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తు పెట్టుకొని మగ పిల్లలతో సమానంగా ఆడ పిల్లలను కూడా చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకుండా పనికి పంపడం దురదృష్టకరమన్నారు. ఇటువంటివి సమాజానికి శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ప్రజల్లో మార్పు రానిదే సత్ఫలితాలు ఆశించలేమన్నారు. ఎక్కడైతే స్పందన, చైతన్యం ఉంటుందో అక్కడ అభివృద్ధి, బాలల వికాసం సాధ్యమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ రెడ్డి, ఐసీడీఎస్ నంబులపూలకుంట సూపర్ వైజర్  నాగమణి, కంప్యూటర్ ఆపరేటర్ కల్యాణి, బ్లాక్ కో ఆర్డినేటర్ జ్ఞానమ్మ, అంగన్వాడీ పిల్లలు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7561
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author