వివాదాలకు తెర తీసిన నంది అవార్డులు

వివాదాలకు తెర తీసిన నంది అవార్డులు
November 15 16:37 2017
హైద్రాబాద్,
2014,15,16 సంవత్సరాలకు గానూ ఏపీ ప్రభుత్వం ఒకేసారి ప్రకటించిన నందీ అవార్డుల విషయంలో విమర్శలు తప్పడం లేదు. ఈ అవార్డులకు అర్హుల ఎంపిక విషయంలో హేతుబద్ధత లేకుండా పోయింది.. అనే మాట గట్టిగా వినిపిస్తోంది. అర్హత ఉన్న సినిమాలకు అవార్డులు దక్కలేదని.. అనర్హమైన సినిమాలకు పెద్ద పీట వేశారనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టుమార్టం చేస్తూ.. ప్రభుత్వంపై, నంది అవార్డుల కమిటీపై ధ్వజమెత్తుతూ సోషల్ మీడియాలో బోలెడన్ని పోస్టింగులు అగుపిస్తున్నాయి.ముందుగా వినిపిస్తున్న మాట ఏమిటంటే.. 2014 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రం ఎంపిక పై విమర్శ. ‘లెజెండ్’ సినిమాను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం వివాదంగా మారుతోంది. అదే ఏడాది విడుదల అయిన ‘మనం’ సినిమాను ద్వితీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. అయితే లెజెండ్ తో పోలిస్తే ‘మనం’ చాలా గొప్ప సినిమా అనేది క్రిటిక్స్ మాట. వైవిధ్యమైన కథా,కథనాలతో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. లెజెండరీ నటుడు ఏఎన్నార్ ఆఖరి సినిమా అది. ఏ రకంగా చూసినా లెజెండ్ కంటే మనం గొప్ప సినిమా అని, కానీ దాన్ని ద్వితీయానికి వేశారనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది. ఎలాగూ లెజెండ్ లో హీరో టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యే కాబట్టి.. ఆ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించారనే విమర్శ కూడా తప్పడం లేదు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7628
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author