చాపకింద నీరులా కిడ్నిమహమ్మారి

చాపకింద నీరులా కిడ్నిమహమ్మారి
November 16 17:14 2017
శ్రీకాకుళం,
శ్రీకాకుళం జిల్లా వాసులను కిడ్నీ మహమ్మారి పట్టిపీడిస్తుంది. ఎవరికీ అంతు చిక్కని రీతిలో చాపకింద నీరులా పాకుతుంది. ఒకానొక సమయంలో ఉద్దానమే కిడ్నీ రోగులకు నిలయంగా మారిందని డాక్టర్లు చెబుతున్నప్పటికీ ఇటీవల జిల్లాలో మరికొన్ని ఉద్దానాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా మందన మండలం లోదరబంద గ్రామానికి చేరుకున్న బృందానికి ఒక్కసారిగా ఉలిక్కిపడేలా సమాచారం వినిపించింది. సంవత్సరాలుగా సమస్యలతో సతమతమవుతుంటే మాగోడు వినడానికి వచ్చారా అంటూ పలువురు తమ ఆవేధనను వెల్లడించారు. 15 రోజుల వ్యవధిలో జల, వాయు కాలుష్యాల వలన చిన్నాపెద్దా తేడా లేకుండా 21 మంది మృత్యవాత పడ్డారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరాయించుకున్నా పట్టించుకోకపోవడమే ఇటువంటి ఘటనలకు కారణమయ్యాయి. వీధుల్లో పర్యటించిన మహాన్యూస్ బృందానికి వింత పరిస్థితి కనిపించింది. ప్రతీ ఇంటా మంచం పట్టి మగ్గుతున్న రోగులు అనేక మంది. రోగులు దగ్గరకు వెళ్లి వారితో మాట్లడగా కిడ్నీ రోగాలు వేధిస్తున్నాయని వారు వాపోతున్నారు. లోదరబంద డాక్టర్లు ముందుగా కొంతమంది కిడ్నీ వ్యాధి రోగులను గుర్తించారని, మరికొంత మందికి ఇలాంటి వ్యాధులు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు. ఉద్ధానం ప్రాంతంలో ఎక్కడ బోర్లు తవ్వినా అక్కడ వచ్చేది ఫ్లోరైడ్ నీరే అని గమనించిన అదికారులు ప్రజలను అప్రమత్తం చేయడంలో అలసత్వం వహిస్తుందని దీంతో కిడ్నీ వ్యాధులు రోజురోజకీ పెరిగిపోతున్నాయని వారు తెలిపారు. కనీసం వ్యాధి సోకిన వారు కొన్నాళ్లు బ్రతకాలని డయాలసిస్ కేంద్రాలకు ఎల్లినప్పటికీ సేవలు అందక బాధపడుతున్నారు. ఎవరింట చూసినా మందులతో కూడిన సంచులు కనిపించడం గమనార్షం. ఆ గ్రామాలలో పుట్టిన పిల్లల్ని కొన్నాళ్లు గడిచిన తర్వాత వేరే జిల్లాలకు గానీ వేరే రాష్ట్రాలకు గానీ పంపేస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉద్ధానం ప్రజలకు కనీస వసతులు కల్పించి కిడ్నీ బారిన పడకుండా ఆదుకోవాలని లోదరబంద గ్రామవాసులు కోరుతున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7680
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author