ఏపీలో యూపీ ఫార్ములా

ఏపీలో యూపీ ఫార్ములా
November 17 12:31 2017
విజయవాడ,
టీడీపీ సర్కార్ ను ఎదిరించేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నిరుద్యోగులు ఈ కూటమి ఏర్పాటు పై దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. యూపీలో మాయావతి ఫార్ములా తరహాలో కాపులు, దళితులను కలిపి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. మాజీ మంత్రి ముద్రగడతో పాటుగా కేంద్ర మాజీమంత్రి చింతామోహన్‌, మాజీ ఎంపీ జివి.హర్షకుమార్ లు ముందుగా ఈ విషయం పై సమాలోచనలు చేశారు. కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందనే అంశం పై కసరత్తులు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అందరికీ ఒక వేదిక దొరికింది. మాజీ మంత్రి శైలజానాధ్‌, మాజీ ఎంఎల్‌ఎలు పాముల రాజేశ్వరీదేవి, పెండెం దొరబాబు, కొప్పుల రాజు తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు పార్టీని ఓడించాలంటే బిసిలు, దళితులు ఏకం కావాలనే అభిప్రాయానికి వారు వచ్చినట్లు తెలుస్తోంది. ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి కాపులు మొదట్లో బాగానే మద్దతునిచ్చినా..ఇప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా సొంత ఊరిలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  పైగా ఆయనతో పెట్టుకుంటే కేసులు, కోర్టులు, పోలీసుల వేధింపులు వస్తాయని భయపడుతున్నారు. లోపల ఆయనకు మద్దతునివ్వాలనే ఆలోచన ఉన్నా..ఆ పనిచేయలేని పరిస్థితి. వారిని ఏక తాటి పైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. పార్టీలకతీతంగా అల్ప సంఖ్యాక వర్గాల కూటమి ఏర్పాటు చేసి..మాయవతి ఎన్నికల్లో గెలిచినట్లు వీరు విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు వారి పాచిక పారుతుందా అనే చర్చ లేకపోలేదు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7801
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
AP
  Categories:
view more articles

About Article Author