కదిరి ఘటన యాధృచ్ఛికం… అనూహ్యం

కదిరి ఘటన యాధృచ్ఛికం… అనూహ్యం
November 17 14:14 2017
అనంతపురం,
అనంతపురం జిల్లా  కదిరి పట్టణంలో గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ రమామణిని ఘెరావ్ చెస్తున్న సమయంలో పోలీసులు సద్దుమణచిన సంఘటన యాధృచ్ఛికం,   అనూహ్యమేనని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. పోలీసులు సంయమనం పాటించి ఉంటే బాగుండేదన్నారు. ఆ ఘటనపై ఎస్పీ విచారం వ్యక్తం చేశారు. మళ్లీ ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి ఆదేశాలు జారీ చేశామన్నారు. కదిరి మండలం కుటాగూళ్ల కు చెందిన నిర్వాసితులు జాయింట్ కలెక్టర్ ను  ఘెరావ్ చేస్తున్నారన్న  సమాచారం ఆ పోలీసులు అందుకున్నారన్నారు. కదిరి పోలీసులు అందుబాటులో ఉన్న సిబ్బందితో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారన్నారు. ఆందోళనకారులు జాయింట్ కలెక్టర్ వాహనం లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారన్నారు. ఆమె వాహనం కింద పడటానికి కూడా యత్నించారన్నారు. ఆ సందర్భంలో అందుబాటులో ఉన్న పోలీసులతోనే జాయింట్ కలెక్టర్ , ఆమె వాహనానికి ఇబ్బంది కల్గకుండా చూశారని… అదే సమయంలో ఆందోళనకారులు వాహనం కింద పడకుండా, వాహనంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు.  మహిళా పోలీసులను రప్పించే సమయం కూడా లేక పోయిందన్నారు. ఏదిఏమైనా ఈఘటనపై అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయిస్తామని… పోలీసులు దురుసుగా వ్యవహరించి ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7844
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author