టేకులోడులో కేటుగాళ్లు 

టేకులోడులో కేటుగాళ్లు 
November 17 19:16 2017
అనంతపురం,
ఐటీ హబ్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం టేకులోడు పరిధిలో 220 ఎకరాలను సేకరించింది. భూములకు పరిహారం పంపిణీలో దళారుల చేతుల్లోకి డబ్బు చేరుతోంది. అమాయకులైన రైతులకు చెందిన భూముల పరిహారంలో కొందరు దళారులు రంగప్రవేశం చేసి మూడో కంటికి తెలియకుండా నిధులు దండుకొంటున్నారు. చిలమత్తూరు మండలం టేకులోడుకు చెందిన 69 మంది రైతులకు సంబంధించి 220 ఎకరాల భూమిని ఐటీ హబ్‌ కోసం ప్రభుత్వం సేకరిస్తోంది. అసైన్డ్‌, ప్రభుత్వ, పట్టా భూములు ఉన్నాయి.
 ఎకరం రూ.6.5 లక్షలు పెట్టి ప్రభుత్వం తీసుకుంది. పలువురు పెద్దలు, భూములు ఉన్న వారు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి గతంలో అక్కడ వారికి అనుకూలంగా ఉండే వాళ్ల పేరుతో రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టాలు పొందారు. అయితే ప్రస్తుతం అవి కొండ గుట్టలు. గతంలో అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఆ భూములకే పట్టాలిచ్చారు. అవే భూములకు ఇప్పుడు పరిహారం పొందే ప్రయత్నాలు చేస్తుండగా.. సాగులో ఉన్న కొందరు కోర్టుకు కూడా వెళ్లారు.ఇదిలా ఉండగా ప్రభుత్వం సేకరించిన భూమికి రైతులకు సంబంధించి వివాదాల్లో ఉన్న భూములు మినహా 174.74 ఎకరాలకు రూ.11.37 కోట్లు పరిహారం వచ్చింది. దీనిలో 53 మంది రైతులకు రూ.9.78 కోట్లు రైతులకు అందించారు. ఈ పరిహారం అందించేందుకు రైతులకు, అధికారులకు మధ్య దళారులు కొందరు ప్రవేశించి కథ నడిపారు.ప్రతి ఎకరాకు ఇంత అంటూ వసూలు చేశారు. వివాదాల్లో ఉన్న భూములను పరిష్కరించేందుకు పెద్దమనుషులుగా వెళ్లి వారు కొంత వెనకేసుకున్నారు. ప్రస్తుతం 16 కేసులకు సంబంధించి 24.49 ఎకరాలకు రూ.1.95 కోట్లు అందించాల్సి ఉంది. ప్రతి రైతు నుంచి రూ.20-30 వేలు వసూలు చేశారు. ఇప్పుడు వివాదాస్పద భూములపై దళారులు దృష్టి సారించారు. అన్నీ తామై పొలాలకు సంబంధించి లేని వారిని తెరపైకి తీసుకువస్తున్నారు. వారే ఆ ఆస్తులకు వారసులంటూ బినామీలను తీసుకువచ్చి అధికారుల ఎదుట నమ్మించి చెక్కులు ఇప్పించి అందులో భారీగా దండుకొంటున్నారు. దీనిలో వారు తమ వాటాలు పొందుతూ వచ్చారు. రైతులకు చెందిన భూ పరిహారానికి సంబంధించి అధికారులు రైతుల నుంచి సేకరించిన బ్యాంకు ఖాతాలకే నగదు జమచేస్తారు. తర్వాత రైతులు నగదు పొంది ఇతర అవసరాలకు వాడుకొంటారు. ఇదే తరుణంలో రైతుల నుంచి ముందుగానే దళారులు అధికారుల పేర్లు చెప్పి నగదు వసూలు చేసి ఆ తర్వాత వారే సెటిల్‌ చేస్తున్నారు. సెటిల్‌ అయిన కేసుల్లోనే బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు జమచేస్తున్నారు. చూడటానికి అధికారికంగా అంతా కచ్చితంగా ఉంటున్నా.. దళారుల సహకారంతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7889
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author