అధికారుల అడ్డగోలు దోపిడీ 

అధికారుల అడ్డగోలు దోపిడీ 
November 17 19:26 2017
చిత్తూరు,
అటవీ సంపదను రక్షించాల్సిన అధికారులే భక్షకులుగా మారుతున్నారు. అవకాశమున్న మేరకు అందినకాడికి దోచుకోవడమే కొందరు లక్ష్యంగా పెట్టుకున్నారు. విలువైన ఎర్రచందనం సంపదకు జిల్లా నిలయంగా ఉంది. వాటిని రక్షించేందుకు కృషి చేయాల్సిన అటవీ శాఖలోని కొందరు ఇంటి దొంగలు ఎర్ర దొంగలతో చేతులు కలిపి అక్రమ రవాణాకు పచ్చ జెండా ఊపుతున్నారు.  ఇదేకాదు అడవులను అభివృద్ధి చేయడం, నర్సరీల్లో మొక్కలు, పచ్చదనం పెంచడం వంటి పనుల్లో అవినీతి చోటు చేసుకుంటోంది. కొందరు అధికారులే బినామీ పేర్లతో కాంట్రాక్టు చేస్తున్నారు. ఎర్ర చందనం కేసుల్లో పట్టుబడ్డ వాహనాల్లోని విడిభాగాలతో పాటు, విలువైన అటవీ సంపదను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండడంతో అటు వైపుగా జిల్లా నుంచి కలప రవాణా అధికంగా ఉంది. కలప అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. రూ.లక్ష దాటిన ఏపనైనా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు  అప్పగించాలి. అధికారులు పర్యవేక్షించి ప్రభుత్వ నిధులు సద్వినియోగమయ్యేలా ఖర్చు చేయించాలి. అందుకు విరుద్ధంగా అటవీ శాఖలోనే కొందరు అధికారులు అక్రమార్జన కోసం కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను పక్కన పెట్టి నామమాత్రంగా పనులు చేయిస్తున్నారు. 1995లో పలమనేరు సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వహిస్తూ ఇదేస్థాయి అధికారి రిజర్వు అటవీ ప్రాంతంలో బండ రాళ్లను పగులగొట్టి తన సొంత ట్రాక్టరుతో రవాణా చేసి విక్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఆయనపై ఛార్జిషీటు ఇచ్చి, ఇంక్రిమెంట్లు రద్దు చేశారు. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి ఇంక్రిమెంట్లు పొందారు. తీరా అసలు విషయం వెలుగు చూడడంతో రూ.లక్ష ప్రభుత్వ ఖజానాకు తిరిగి జమ చేయించారు.  పశ్చిమ విభాగంలోనే కాదు అన్ని విభాగాల్లోను ఆ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీని వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అటవీ శాఖ వెస్ట్ జోన్ పరిధి యాదమరి మండలం కమ్మపల్లి బీటు పరదరామి రిజర్వు అటవీ ప్రాంతంలో 18 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు తొలగించి శుభ్రం చేయించేందుకు రూ.3.90 లక్షలతో పని మంజూరైంది. ఈ పనికి కాంట్రాక్టర్ గా ఆ శాఖలోని డిప్యూటీ రేంజ్‌ అధికారి వ్యవహరించారు. 10 హెక్టార్లలో నామమాత్రంగా పని చేయించారు. ఎంబుక్‌లో 18 హెక్టార్లలో పని చేయించినట్లు నమోదు చేసి రూ.2,55,464 నిధులు డ్రా చేశారు. ఇందులో 10 హెక్టార్లలో నాణ్యతగా పని చేయించారు. ఇందుకు రూ.1,38,970 నిధులు డ్రా చేయాలి. ఈ మొత్తాన్ని మినహాయిస్తే అదనంగా రూ.1,16,494 పొందారు.అప్పటి బీటు గార్డు ద్వారా పని చేయించి, ఎంబుక్‌ సంఖ్య 37/2014-15లో 18 హెక్టార్లలో నిబంధనల మేరకు పని పూర్తయినట్లు నమోదు చేసి నిధులు డ్రా చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7892
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author