అసెంబ్లీ ముట్టడికి తరలుతున్న ఆరెకటిక సంఘం

 అసెంబ్లీ ముట్టడికి తరలుతున్న ఆరెకటిక సంఘం
November 17 19:42 2017
హైదరాబాద్,
ఆరెకటికలను ఎస్సీ జాబితాలో చేర్సాలంటూ రాష్ట్ర ఆరెకటిక సంఘం పిలుపు మేరకు చలో అసెంబ్లీ ముట్టడికి తరలుతున్న ఆరెకటికలను హన్వాడ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్బంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి హైదరాబాద్ తరలివెళ్లేందుకు హన్వాడాకు చేరుకున్న ఆరెకటికలను సమాచారం తెలుసుకున్న హన్వాడా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్బంగా హన్వాడ మండల సంఘం అద్యక్షకార్యదర్శులు రమేష్జీ, రాంచందర్జీలు మాట్లాడుతూ దేశంలోని 19రాష్ట్రాలలో ఆరెకటిక కులం ఎస్సీ జాబితాలో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసి డి జాబితా ఉందన్నారు. దీని కారణంగా ఆరెకటికలకు సరైన విద్య అందక, ఉద్యోగాలు రాక… రాజకీయ ప్రాధాన్యం లేక ఆరెకటికలు వెనకబాటుకు గురౌతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ కులాల సంక్షేమానికి వివిధ సంక్షేమ పథకాలు ప్రవేషపెడుతుందన్నారు. అదేవిధంగా తమకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వెనకబాటుకు,అన్యాయానికి గురైన తమ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చి తమకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఈసందర్బంగా వారు డిమాండ్ చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7898
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author