సినీ పక్కీలో టాస్క్ ఫోర్స్ చేజ్ 

సినీ పక్కీలో టాస్క్ ఫోర్స్ చేజ్ 
November 18 12:24 2017
చిత్తూరు,
 తమిళనాడు కు తరలిస్తున్న 82 ఎర్ర చందనం దుంగలు కల ఈచర్ లారీని టాస్క్ ఫోర్స్ సిబ్బంది 45 నిముషాల పాటు చేస్ చేసి పట్టుకున్నారు ఏర్పేడు శ్ర్రీ కళాశాల నుంచి ఉప్పరపల్లి మల్లంగుంట పాత చెక్ పోస్ట్ వద్ద కార్లు బారికేడ్స్ అడ్డంగా పెట్టి ఈచర్ వాహనాన్ని అడ్డుకున్నారు. లారీ డ్రైవర్ ను పట్తుకునే ప్రయత్నం చేయగా అతను కత్తితో దాడి చేశాడు.  తమిళ నాడు తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకా కన్నెమంగళం సమీపంలో ని ఇరుంబలి,  జవ్వాది మలైకు చెందిన వీరు నాలుగు రోజుల క్రితం 80 మందితో శేషాచలం లోని కాకుల మాను వద్ద చెట్లని నరికి దాదాపు 30 కిలోమీటర్లు దుంగలను మోసుకుని ఏర్పేడు శ్రీ కళాశాల ప్రాంతం వద్ద ఈచర్ వాహనం లోకీ లోడ్ చేశారు. సమాచారం అందుకుని ఎస్ ఐ అశోక్ కుమార్ బృందం అక్కడ కు చేరుకునే సమయానికి ఈచర్ వాహనం బయలు దేరింది. ఆ వాహనాని వీరు మూడు వాహనాలలో వెంబడించారు. వంద కిలోమీటర్ల వేగం తో వెళుతున్న వాహనాన్ని చేజ్ సేశారు.   టాస్క్ ఫోర్స్ ను తికమక పెట్టేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్మాలు ఫలించలేదు. ఒక దశలో టాస్క్ ఫోర్స్ వాహనాన్ని గుద్దే ప్రయత్నం చేశాడు. అశోక్ కుమార్ చాకచక్యంగా తిరుపతి చిత్తూరు హై వే లోని మల్లంగుంట చెక్ పోస్ట్ వద్ద బ్యారికేట్స్ ఏర్పాటు చేశారు. డ్రైవర్ విధిలేని పరిస్థితులలో వేగాన్ని తగ్గించగా టాస్క్ ఫోర్స్ వాహనాన్ని అడ్డుపెట్టి ఆపగలిగారు. వెంటనే డ్రైవర్ శంకర్  కత్తితో దాడి చేయగా,అతన్ని ఒడిసి పట్టుకొని అరెస్ట్ చేశారు. అతని తో పాటు కీలక వ్యక్తిగా బావిస్తున్న శివాజీ అనే వ్యక్తి ని కూడా అరేస్ట్ చేశారు. లారీలోని దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7973
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author