ఏసీబీ వలలో సర్వే ఇన్స్పెక్టర్

ఏసీబీ వలలో సర్వే ఇన్స్పెక్టర్
November 18 16:07 2017
విశాఖపట్నం,
కోట్లకు పడగలెత్తిన మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. విజయనగరం జిల్లాలో సర్వే విభాగం ఇన్స్పెక్టర్ లక్ష్మీగణేశర్వరరావు ఆస్తులపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహిస్తున్నారు. ఆయాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్, విశాఖ పట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లక్ష్మీ గణేశ్వరరావు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. కాగా లక్ష్మీ గణేశ్వరరావుపై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన్ను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8019
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author