వైభవంగా అనంతుడికి పూజలు

వైభవంగా అనంతుడికి పూజలు
November 18 20:24 2017
విశాఖపట్నం,
ఆధ్యాత్మిక వెలుగులు విశాఖ సాగరతీరాన్ని దేదివ్యమానం చేశాయి. పద్మనాభం క్షేత్రంలో కొండ మెట్ల దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు తరలివచ్చి గిరిని అధిరోహిస్తూ స్వామి సన్నిధికి చేరుకున్నారు. మెట్లకు పసుపు, కుంకు రాసి పలువురు మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కొండ దిగువున ఉన్న కుంతీమాధవస్వామి ఆలయం నుంచి మేళ తాళాలతో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ అనంతపద్మనాభస్వామివారి ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై వూరేగించి తొలిపావంచా వద్దకు తోడ్కొని వచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉత్సవ మూర్తులను అధిష్ఠింపజేసి అర్చకులు పూజలు చేశారు. కొండపై నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆలయంలో జేగంట మోగగానే భక్తులు మెట్లకు ఇరువైపులా దీపాలను వెలిగించడంతో దీపోత్సవం ప్రారంభమైంది. అఝాత వాసం కాలంలో కుంతీ దేవీ ప్రార్థనల మేరకు ఇక్కడ దేవదేవుడు అనంత పద్మనాభునిగా వెలిసినట్టు పురాణాలు చెబుతుంటాయి. అయితే కార్తీక మాసం ఆఖరి రోజైన అమావాస్య రోజున ఇక్కడ 1350 మెట్లపై దీపాలు వెలిగించడం ఆనవాయితీ.. రాజుల కాలం నుంచి మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ దశలో మద్యాహ్నం సరికే చెరుకున్న భక్తులు కొండ చివరి వరకు దీపాలను వెలిగించారు. దీంతో సాయంత్రం చీకటి పడుతున్న దశలోనే దీపోత్సవం మొదలైంది. అంచనాలకు మించి కనీసం రెండు లక్షలమంది భక్తులు ఈ దీపోత్సవంలో పాల్గొన్నట్టు అంచనా. దీపాలు వెలుగులు ఇటు విశాఖ .. అటు విజయనగరం జిల్లా పల్లెల వరకు కనిపించాయి. పద్మనాభం పరిసరాలు పూర్తిగా వెలిగిపోయాయి. ఈ దీపోత్సవంలో పాల్గొనడం ఎన్నో జన్మల పుణ్యంగా భక్తులు అభిప్రాయపడ్డారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8052
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author