సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ
November 18 21:48 2017
హైదరాబాద్‌
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో శనివారం చోరీ జరిగింది. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. ఈ మేరకు లక్ష్మినారాయణ కుటుంబసభ్యులు ఈ రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు దీంతో బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు ఇంట్లో పనిచేసే వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ప్రస్తుతం లక్ష్మినారాయణ మహారాష్ట్ర అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8058
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author