అక్కడ సిమెంట్ ఎంతో తెలుసా

అక్కడ సిమెంట్ ఎంతో తెలుసా
November 18 22:22 2017
ఇటానగర్
 సిమెంట్‌ బస్తా ధర రూ. 300 నుంచి రూ.400 వరకు ఉంటుంది. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ పట్టణంలో మాత్రం ఈ ధర అక్షరాల రూ.8000. నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇది నిజం. సరిహద్దు పట్టణమైన విజోయ్‌నగర్‌లో ఒక సిమెంట్‌ బస్తాను రూ. 8వేలకు విక్రయిస్తున్నారట. అది కూడా అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే. లేకపోతే ఈ ధర మరింత పెరుగుతుంది.చాంగ్‌లాంగ్‌ జిల్లాలో ఉంటుంది ఈ విజోయ్‌నగర్‌. ఇక్కడి జనాభా కేవలం 1500 మంది మాత్రమే. ఈ పట్టణానికి సరైన రవాణా మార్గం లేదు. సమీప పట్టణానికి చేరుకోవాలంటే కాలినడకనే వెళ్లాలి. వారానికోసారి హెలికాప్టర్‌ సర్వీస్‌ ఉన్నా.. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అది కూడా అడపాదడపా మాత్రమే పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో వ్యక్తిగత మరుగుదొడ్ల కార్యక్రమాన్ని చేపట్టింది అక్కడి పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌. కేంద్రప్రభుత్వం సహకారంతో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. ఒక్కో మరుగుదొడ్డికి కేంద్రం రూ. 10,800 ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.9,200 అందిస్తుంది. అయితే ఈ డబ్బుతో మరుగుదొడ్డి నిర్మాణం కష్టమవుతుంది అంటున్నారు అక్కడి అధికారులు.ఇక్కడ ఒక్క సిమెంట్‌ బస్తా ధర రూ. 8000 ఉందని జూనియర్‌ ఇంజినీర్‌ జుమ్లీ అడో అన్నారు. ‘మరుగుదొడ్ల నిర్మాణం కోసం నందాఫా నేషనల్‌ పార్క్‌ నుంచి మెటీరియల్‌ను విజోయ్‌నగర్‌కు సరఫరా చేస్తున్నారు. అయితే సిమెంట్‌ బస్తాకు రూ. 8000, టాయిలెట్‌ బేసిన్‌కు రూ. 2వేల చొప్పున విక్రయిస్తున్నారు’ అని జుమ్లీ వెల్లడించారు. ఈ మెటీరియల్‌ను తీసుకెళ్లాలంటే కాలినడక మాత్రమే వెళ్లాలి. ఒకసారి మెటీరియల్‌ రావడానికి ఐదురోజుల సమయం పడుతుంది. దాదాపు 156 కిలోమీటర్లు నడిచి వీటిని మోసుకొస్తున్నారు. అందుకే ధరలు ఆకాశన్నంటుతున్నాయని జుమ్లీ తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8075
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author