సమావేశానికి ‘‘రాం..రాం’’

సమావేశానికి ‘‘రాం..రాం’’
November 19 14:39 2017
ఆదిలాబాద్‌,
ఆదిలాబాద్ జిల్లాపరిషత్ సమావేశాలకు సభ్యులు సరిగా హాజరుకాకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ప్రజా సమస్యలపై చర్చించి.. పరిష్కరించాల్సిన వారే మీటింగులకు మొహం చాటేస్తుండడాన్ని అంతా తప్పుపడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రస్తుతం మండలి అధ్యక్షుడిగా ఉన్న స్వామిగౌడ్‌, పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి సమావేశాల వైపే చూడ్డం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలది ఇదే పరిస్థితిగా తెలుస్తోంది. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాలు ప్రతి మూడునెలలకోసారి తప్పనిసరి నిర్వహించాలి. ఇందులో జడ్పీటీసీ సభ్యులతో పాటూ శాశ్వత ఆహ్వానితులుగా హాజరయ్యే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభ్యులే. కానీ సమావేశంలో కోరం కోసం, తీర్మానాల్లో మెజార్టీ కోసమే వీరు సభ్యులు. మిగితా ఛైర్మన్‌ ఎన్నిక, అవిశ్వాస తీర్మాన సమయంలో వీరికి ఓటు హక్కు ఉండదు.  జడ్పీ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరైతే సమావేశానికి ప్రాధాన్యత లభిస్తుంది. ప్రజాసమస్యలను సీరియస్ గా తీసుకుంటున్నారని ప్రజలు భావిస్తారు. అధికారుల్లోనూ జవాబుదారి తనం ఉంటుంది. అయితే ఆదిలాబాద్ లో కొంతకాలంగా ఈ పరిస్థితి కనుమరుగైపోయిందని స్థానికులు అంటున్నారు. వాస్తవానికి ఎంపీలకు పార్లమెంటులో, ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో, ఎమ్మెల్సీలకు మండలిలో మాట్లాడేందుకు అవకాశం లభిస్తుంది. జడ్పీలో సభ్యులైన జడ్పీటీసీలతోపాటు ఆహ్వానితులుగా హాజరయ్యే మండల పరిషత్‌ అధ్యక్షులు(ఎంపీపీ)లు మాట్లాడేందుకు అవకాశముంటుంది. అయితే అధికారులు స్పందించకున్నా, సరైన సమాధానం ఇవ్వకున్నా సమావేశానికి హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారిని ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికారుల్లోనూ ఒకింత బాధ్యత ఉంటోంది. జిల్లాకు సంబంధించి కీలక ప్రజాప్రతినిధులందరూ వస్తారనే ఆయాశాఖలకు చెందిన అధికారులంతా క్రమం తప్పకుండా ఈ సర్వసభ్య సమావేశాలకు హాజరవుతారు. అందుకనే జడ్పీ సమావేశాలను స్థానికులు ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే కొందరు ప్రజా ప్రతినిథులు సమావేశాలకు గైర్హాజరవడంపై అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఇప్పటికైనా నేతలు సమావేశాలకు హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని, ప్రాంతీయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8125
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author