రబీ కోసం నీటి కసరత్తులు

రబీ కోసం నీటి కసరత్తులు
November 20 12:01 2017
తూర్పుగోదావరి,
తూర్పుగోదావరి జిల్లాలో రబీ పంట నిమిత్తం నీరు పూర్తిస్థాయిలో అందించాలని సంబంధిత అధికార యంత్రాంగం భావిస్తోంది. పూర్తి ఆయకట్టుకు నీరందించాలని ఐఏబీ సమావేశంలోనే తీర్మానించారు. ఈ నేపథ్యంలో శివారు ఆయకట్టుకు సైతం సమగ్రంగా నీటి సరఫరాకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను జలనవరుల శాఖ సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉంటే తూర్పు, మధ్య డెల్టాల్లో మొత్తం 348 చోట్ల అడ్డుకట్టలు (క్రాస్‌బండ్లు) వేయాల్సి ఉందని అధికారులు నిర్ణయించారు. తూర్పు డెల్టాలో 178, మధ్య డెల్టాలో 170 చోట్ల వీటిని ఏర్పాటు చేస్తే సాగునీటి సమస్యను అధిగమించవచ్చని ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. వీటితో పాటు గోదావరిలో నీటి లభ్యత అధికంగా ఉన్న ప్రాంతాల్లో తాత్కాలిక ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి ప్రధాన కాలువల్లోకి నీటిని తోడాలని తీర్మానించారు. మధ్య డెల్టా పరిధిలో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. వీటితో పాటు డ్రైన్ల నుంచి రైతులు నీటిని తోడుకునేందుకు ఆయిల్‌ ఇంజిన్లు వినియోగిస్తే అందుకు రూ.నాలుగు కోట్ల మేరకు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. ప్రధాన కాలువలో రూ.60 లక్షలతో అడ్డుకట్టలు వేసి శివారు ఆయకట్టుకు నీటి అందజేయాలని కూడా భావిస్తున్నారు. ఆయిల్‌ ఇంజిన్ల వినియోగం పి.గన్నవరం, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, ఐ.పోలవరం తదితర మండలాల్లో ఎక్కువగా ఉంటుందని జలవనరుల శాఖ ఈఈ తెలిపారు. ఈ మేరకు సుమారు రూ.11 కోట్లతో అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు అందజేసినట్లు చెప్పారు.  తూర్పు డెల్టాకు సంబంధించి రబీలో 2.32 లక్షల ఎకరాలు సాగులో ఉండగా కాజులూరు, కరప, తాళ్లరేవు మండలాల పరిధిలో సుమారు 40 వేల ఎకరాలకు నీరందే పరిస్థితి లేదని జలవనరుల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ డెల్టా ద్వారా పిఠాపురం బ్రాంచి కెనాల్‌(పీబీసీ) ఆయకట్టు 32,700 ఎకరాలుండగా, ఇందులో 13,700 మేర శివారు ఆయకట్టు ఉంది. ఈ మేరకు బ్యారేజీ దిగువన వేమగిరి వద్ద తాత్కాలిక ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు రూ.4 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు ప్రధాన కాలువలో 12 చోట్ల అడ్డుకట్టలు, రైతులకు ఆయిల్‌ ఇంజిన్లకు సంబంధించి రూ.4.30 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించినట్లు ఈఈ అప్పలనాయుడు తెలిపారు. నీటి లభ్యత అవసరమైన మేర ఉంటే ఈ నిధులను వినియోగించే పరిస్థితి ఉండదని, ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటామని చెప్పారు.ప్రధాన కాలువ నుంచి రైతులకు నీటిని అందజేయాలంటే డ్రైనేజీ వ్యవస్థ కీలకం. ఈ నేపథ్యంలో రెండు డెల్టాలకు సంబంధించి డ్రైనేజీల్లో 348 ప్రాంతాల్లో అడ్డుకట్టలు వేయాలని నిర్ణయించారు. తూర్పు డెల్టా పరిధిలో 178 పనులకు రూ.1.85 కోట్లు, మధ్య డెల్టాలో 170 పనులకు రూ.2.41 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. రైతులకు మద్దతుగా పంటలకు నీరందించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అన్నీ అనుకున్నట్టుగానే సాగితే.. ఈ రబీలో మంచి దిగుబడులే సాధించగలమని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8160
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author