ఎంజీఎంలో  మందుల కొరత

ఎంజీఎంలో  మందుల కొరత
November 20 14:28 2017
వరంగల్,
ఓ పక్క సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. పెద్దాస్పత్రిగా పేరుగాంచిన మహాత్మాగాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆస్పత్రిలో నమోదయ్యే ఓపీ సాధారణ రోగుల సంఖ్య రోజుకు రెండు వేల నుంచి మూడు వేలకు చేరుకుంది. ఇలాంటి సీజన్‌లో అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన సేవలందించాల్సిన అధికారులు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో నెలకొన్న ఔషధాల కొరత వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పిడియాట్రిక్‌ విభాగంలో చిన్న పిల్లలు, పెద్దలకు జ్వరం, దగ్గు వంటి తదితర వ్యాధులకు సంబంధించిన పలురకాల మందులు పూర్తిస్థాయిలో నిండుకున్నాయి.యమ’జీఎంగా మారింది. ఏటేటా పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలందకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైద్య పరికరాల లేమి.. వసతుల కొరత.. అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ వైద్యం అందని దైన్య పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆస్పత్రిని ఔషధాల కొరత పీడిస్తోంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఎలాంటి ఔషధాలు ఉన్నాయి.. వర్షాకాలం సీజన్‌ నేపథ్యంలో ఎంత మేర అవసరమవుతాయో.. అనే కోణంలో పరిపాలనాధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. వైద్యులు రాసిన చీటీలు పట్టుకుని ఔషధాల కోసం కుస్తీ పట్టగా.. రాసిన ఐదు రకాల్లో ఒకటో.. రెండో తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో మందులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించడానికి వెళితే.. ఆస్పత్రిలో పరిపాలనాధికారుల జాడ తెలియడం లేదని రోగులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో పెద్దాస్పత్రికి వస్తున్నామని.. వందల రూపాయలు వెచ్చించి బయట కొనుగోలు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. అరకొర మందులతో వ్యాధుల తగ్గుముఖం పట్టకపోవడంతో నానా అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న క్రమంలో ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో మేల్, ఫిమేల్‌ ఓపీలలో నిత్యం వందలాది మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో పరిస్థితి విషమంగా ఉన్న రోగులను ఇన్‌పెషెంట్‌గా అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. మిగతా రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి యాంటీబయోటిక్‌తో పాటు  వివిధ రకాల ఔషధాలను రాసి పంపిస్తున్నారు. వైద్యులు రాసిన చీటీలు పట్టుకుని ఆస్పత్రిలో ఫార్మసీ విభాగానికి వెళ్లిన రోగులకు భంగపాటు తప్పడం లేదు. అరకొరగా మాత్రలు ఇస్తుండడంతో పేద రోగులు ఏంచేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు.సీజనల్‌ వ్యాధుల సమయంలో అందించే ఆమాక్సిలిన్‌ క్లవ్‌నెట్‌ వంటి యాంటీబయోటిక్‌ మాత్రల నిల్వలు వారం రోజుల క్రితమే నిండుకుంటున్నాయి. అయినప్పటికీ పరిపాలనాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాకుండా సాధారాణంగా అందించే బీపీ, కోలోబీపీ, కొలెస్ట్రాల్, లివర్, మలేరియాకు సంబంధించిన ఔషధాల నిల్వలు ఆస్పత్రిలో పూర్తిగా నిండుకున్నాయి. నొప్పులకు కోసం అందించే ఔషధాలు సైతం ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8184
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
mgm
  Categories:
view more articles

About Article Author