దళితుల భూములెక్కడ..? 

 దళితుల భూములెక్కడ..? 
November 20 15:21 2017
హైదరాబాద్,
‘దళితులకు మూడెకరాల పథకం’ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్టు తయారైంది. ప్రతి జిల్లాలోనూ ఈ పథకం నత్తనడకన సాగుతోంది. ఈ పథకం ద్వారా మూడేళ్లలో కేవలం 3741 మందికే భూ పంపిణీ జరిగింది. 2017-18 సంవత్సరంలో ఇప్పటివరకు 807మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరికి రూ.50 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి 10వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.93.80 కోట్ల వ్యయంతో 2005 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కేవలం నాలుగున్నర నెలల స్వల్ప కాలంలో మరో 8వేల ఎకరాల కొనుగోలు సాధ్యమయ్యేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
 ఇదిలా ఉండగా 31 జిల్లాల్లో ఈ ఏడాది 807 మందిని గుర్తించి ప్రభుత్వం భూమి మంజూరు చేసింది. కానీ 9 జిల్లాల్లో ఒక్క దళిత అర్హుడికీ కూడా భూ పంపిణీ జరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జగిత్యాల, జనగాం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి,సంగారెడ్డి, వరంగల్‌ అర్బన్‌, యాదాద్రి జిల్లాల్లో ఒక ఎకరా భూమి కూడా పంపిణీ జరగలేదు. ఖమ్మంలో 9మందికి, కొమురంభీం జిల్లాల్లో నలుగురికి మాత్రమే భూ పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌లో 199 మందికి, జోగులాంబ-గద్వాల 77, సిద్దిపేట 71, వనపర్తిలో 75 మందికి పంపిణీ చేశారు. మిగతా జిల్లాల్లో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. చాలా జిల్లాల్లో భూమి లభ్యత లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఎకరాకు రూ.7లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ ధరకు భూమి లభించే అవకాశాలున్నా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల జోక్యం ఎక్కువవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు చూపించిన భూమినే ఎంపిక చేసి నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాల్సి ఉన్నందున నిధులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. వీరి వల్ల రూ.4-5 లక్షలకు లభించే భూమిని రూ.7 లక్షల వరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులేర్పడ్డాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8193
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author